Ishan Kishan says I could have got 300 runs also: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (210; 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లు) డబుల్ సెంచరీ చేశాడు. కెరీర్‌లో సాధించిన తొలి సెంచరీనే.. ఇషాన్ డబుల్ సెంచరీగా మలచడం అద్భుతం. 85 బంతుల్లో శతకం చేసిన ఇషాన్.. 126 బంతుల్లో ద్విశతకం చేశాడు. సెంచరీ అనంతరం రెచ్చిపోయిన ఇషాన్.. కేవలం 41 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దాంతో వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇషాన్ సహా విరాట్ కోహ్లీ (113; 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా చెలరేగడంతో భారత్ 409 రన్స్ చేసింది.
తాను ఔట్ కాకపోయి ఉంటే కచ్చితంగా 300 కొట్టేవాడిని అని ఇషాన్ కిషన్ చెప్పాడు. వన్డే ఫార్మాట్‌లో తొలి త్రిశతకం చేసే అవకాశాన్ని కోల్పోయినందుకు కాస్త అసంతృప్తిగా ఉందన్నాడు. ఇన్నింగ్స్ బ్రేక్ మధ్యలో ఇషాన్ కిషన్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ... 'పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అందుకే ప్రతీ బంతిని హిట్ చేయాలని నిర్ణయించుకున్నా. డబుల్ సెంచరీ చేసి దిగ్గజాల సరసన చేరడంను అదృష్టంగా భావిస్తున్నా. అయితే అనవసరంగా ఔటయ్యాననే ఫీలింగ్ కలిగింది. నేను ఔటయ్యే సమయానికి ఇంకా 15 ఓవర్లు ఉన్నాయి. 300 స్కోర్ చేయడానికి అవకాశం ఉంది' అని అన్నాడు.
'విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. కోహ్లీ సూచనలతోనే సెంచరీ, డబుల్ సెంచరీ సాధ్యమైంది. 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆడమని పదేపదే నా వద్దకు వచ్చి చెప్పాడు. నేను మాత్రం బౌండరీలు బాదాలని చూసా. కోహ్లీ మాత్రం సింగిల్స్ తీయమని, ఇది నీ తొలి సెంచరీ అని చెప్పాడు. ఇక మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ భయ్యాతో మాట్లాడాను. బంతిని స్పష్టంగా చూసి షాట్ ఆడమని చెప్పాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురవొద్దని సూచించాడు. స్వేచ్చగా నీ షాట్లు ఆడకో అని చెప్పాడు' అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
భారత్ తరఫున డబుల్ సెంచరీ బాదిన నాలుగో బ్యాటర్ ఇషాన్ కిషన్. ఇప్పటివరకు రోహిత్ శర్మ (264, 209, 208 నాటౌట్) మూడుసార్లు డబుల్ సెంచరీ బాధగా.. వీరేంద్ర సెహ్వాగ్ (219), సచిన్ టెండూల్కర్ (200 నాటౌట్) తలో డబుల్ బాదారు. మార్టిన్ గప్టిల్ (237), క్రిస్ గేల్ (215), ఫకర్ జామన్ (210) కూడా డబుల్ సెంచరీ బాదిన జాబితాలో ఉన్నారు. డబుల్ సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడు కూడా ఇషానే కావడం గమనార్హం.
Also Read: IND vs BAN 3rd ODI: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. తప్పిన క్లీన్‌స్వీప్ గండం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.