India vs England: వైజాగ్ టెస్టుకు ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ దూరం.. అతడి స్థానంలో కొత్త కుర్రాడు..

Ind vs Eng: భార‌త జ‌ట్టుతో రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్ కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్‌ గాయం కారణంగా వైజాగ్ టెస్టు ఆడటం లేదు. అతడి స్థానంలో కొత్త కుర్రాడిని ఎంపిక చేశారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2024, 06:50 PM IST
India vs England: వైజాగ్ టెస్టుకు ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ దూరం.. అతడి స్థానంలో కొత్త కుర్రాడు..

India vs England 02nd test: అద్భుతమైన పోరాట పటిమతో తొలి టెస్టులో గెలిచి మాంచి జోష్ లో ఉన్న ఇంగ్లాండ్ కు భారీ షాక్ తగిలింది. మోకాలి గాయం కారణంగా స్టార్ స్పిన్న‌ర్ జాక్ లీచ్‌(Jack Leach) వైజాగ్ టెస్టుకు దూర‌మ‌య్యాడు. దీంతో అతడు రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) వెల్ల‌డించాడు. గాయం కారణంగా అతడి మోకాలిలో రక్తం గడ్డకట్టిందని.. ప్రస్తుతం లీచ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని.. త్వరలోనే జట్టుతో కలుస్తాడని స్టోక్స్ తెలిపాడు. తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా లీచ్ గాయ‌ప‌డ్డాడు. 

లీచ్ స్థానంలో పాకిస్థాన్ మూలాలున్న‌ షోయ‌బ్ బ‌షీర్(Shoaib Bashir)ను ఎంపిక చేసింది స్టోక్స్ సేన. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్బుతమైన రికార్డు ఉన్న షోయ‌బ్ వైజాగ్ టెస్టులో అరంగేట్రం చేయ‌డం ఫిక్స్ అయిపోయింది. మార్క్ వుడ్ ప్లేస్‌లో వెట‌ర‌న్ బౌల‌ర్ జేమ్స్ అండ‌ర్స‌న్(James Anderson) టీమ్ లోకి వ‌చ్చాడు. అండ‌ర్స‌న్ మరో పది వికెట్లు తీస్తే 700 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా లెజెండరీ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్(Muttaiah Muralidharan), దివంగ‌త ఆస్ట్రేలియా లెగ్ స్పిన్న‌ర్ షేన్ వార్న్‌(Shane Warne)ల త‌ర్వాత 700 వికెట్లు తీసిన మూడో బౌల‌ర్‌గా రికార్డు సృష్టిస్తాడు. 

Also Read: Agni Chopra: చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్కడు..

తొలి టెస్టులో స్పిన్ తో టీమిండియాను దెబ్బ‌కొట్టిన‌ ఇంగ్లీష్ జట్టు.. వైజాగ్ టెస్టులోనూ అదే వ్యూహంతో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టు హీరో టామ్ హ‌ర్ట్లే, రెహాన్ అహ్మ‌ద్‌తో పాటు కొత్త కుర్రాడు షోయ‌బ్ బ‌షీర్‌ల‌తో కూడిన స్పెష‌లిస్ట్ స్పిన్ బృందం భార‌త బ్యాట‌ర్ల‌కు స‌వాల్ విస‌ర‌నుంది.

రెండో టెస్టుకు ఇంగ్లండ్ జ‌ట్టు: జాక్ క్రాలే, బెన్ డ‌కెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మ‌ద్, టామ్ హ‌ర్ట్లే, షోయ‌బ్ బ‌షీర్, జేమ్స్ అండ‌ర్స‌న్.

Also Read: ICC Test rankings: టెస్టుల్లో టాప్-10లో ముగ్గురు మనోళ్లే.. అశ్విన్‌కు అగ్రస్థానం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News