IND vs ENG 03rd Test: రాజ్‌కోట్‌ టెస్టుకు టీమ్ ను ప్రకటించిన ఇంగ్లండ్.. తిరిగొచ్చిన స్టార్ పేసర్..

IND vs ENG: రాజ్‌కోట్‌ టెస్టుకు జట్టును ప్రకటించింది ఇంగ్లండ్ టీమ్. మూడో టెస్టులో స్టోక్స్ సేన ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2024, 05:27 PM IST
IND vs ENG 03rd Test: రాజ్‌కోట్‌ టెస్టుకు టీమ్ ను ప్రకటించిన ఇంగ్లండ్.. తిరిగొచ్చిన స్టార్ పేసర్..

IND vs ENG 03rd Test Updates: రేపటి (ఫిబ్రవరి 15) నుంచి రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్ తో మూడో టెస్టు ఆరంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా.. ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. దీంతో రాజ్‌కోట్‌ రెండు టీమ్ లకు  చాలా కీలకమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో స్టోక్స్ సేన మూడో టెస్టుకు జట్టును ప్రకటించింది. ఈసారి ఇంగ్లండ్ జట్టు ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. వైజాగ్‌ టెస్టులో అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్‌ షోయభ్‌ బషీర్‌ స్థానంలో పేసర్‌ మార్క్‌వుడ్‌ను తుది జట్టులోకి తీసుకుంది ఇంగ్లండ్. రాజ్‌కోట్‌ పిచ్‌ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశమున్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇక భారత్ విషయానికొస్తే.. ఓపెనర్లుగా రోహిత్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఇక వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన కోహ్లీ స్థానంలో రజత పటిదార్ ఆడే అవకాశాలు ఉన్నాయి. శ్రేయస్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ టెస్టు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జడేజా రీఎంట్రీ ఇవ్వడం భారత్ కు కలిసొచ్చే అంశం. విఫలమవుతున్న తెలుగు కుర్రాడు భరత్ స్థానంలో ధ్రువ్ ఆడే అవకాశం ఉంది. సిరాజ్ తిరిగి రావడంతో టీమిండియా పేస్ బలపడింది. 

రాజ్‌కోట్‌ టెస్టుకు ఇంగ్లండ్‌ తుది జట్టు: జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఒలీ పోప్‌, జో రూట్‌, జానీ బెయిర్‌ స్టో, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), బెన్‌ ఫోక్స్‌, రిహాన్‌ అహ్మద్‌, టామ్‌ హర్ట్లీ, మార్క్‌ వుడ్‌, జేమ్స్‌ అండర్సన్‌

Also Read: Dattajirao Gaekwad dies: టీమిండియా లెజండరీ క్రికెటర్ కన్నుమూత

Also Read: Saurabh Tiwari Retirement: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన చోటా ధోని!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News