Yashasvi Jaiswal: యశస్వి మరో ఘనత.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి జైస్వాల్‌..

Yashasvi Jaiswal: ఇంగ్లండ్ తో సిరీస్ లో యశస్వి జైస్వాల్ చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాది.. ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2024, 08:42 PM IST
Yashasvi Jaiswal: యశస్వి మరో ఘనత.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి జైస్వాల్‌..

Yashasvi Jaiswal Rare feat: భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ టెస్టుల్లో దుమ్మురేపుతున్నాడు. వరుసగా సెంచరీల మీద సెంచరీలు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంగా మారుతున్నాడు.  ఇంగ్లండ్ తో సిరీస్ లో వరుసగా రెండు టెస్టుల్లో ద్విశతకాలు బాది తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. వైజాగ్ టెస్టులో డబుల్ కొట్టిన ఈ యువ కెరటం.. రాజ్ కోట్ లోనూ అదే ఫీట్ రిపీట్ చేశాడు. ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో 12 భారీ సిక్సర్లు కొట్టి.. బాది ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజాను వెనక్కి నెట్టి ఈ ఫీట్ సాధించాడు. 

2023లో వెస్టిండీస్‌ పై ఆరంగ్రేటం చేశాడు జైస్వాల్. తొలి టెస్టులో భారీ శతకం సాధించి తనేంటో నిరూపించాడు. ఆ తర్వాత సఫారీ గడ్డపై పెద్దగా రాణించకపోయినా.. స్వదేశంలో జరుగుతున్న ఇంగ్లండ్‌పై మాత్రం చెలరేగిపోతున్నాడు. హైదరాబాద్‌ టెస్టులో సెంచరీ మిస్ చేసుకున్న ఈ ముంబై బ్యాటర్‌.. వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీ బాదాడు.  తాజాగా రాజ్‌కోట్‌లో ద్విశతకంతో మెరిశాడు. ఈ సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్‌.. 6 ఇన్నింగ్స్‌లలో 545 పరుగులు చేసి సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇతడి దరిదాపుల్లో ఏ బ్యాటర్‌ కూడా లేడు.  రెండో స్థానంలో బెన్‌ డకెట్‌(288) ఉన్నాడు. 

Also Read: రాజ్‌కోట్‌ మనదే.. ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా..

Also Read: ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోసిన యశస్వి.. వరుసగా రెండో డబుల్ సెంచరీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News