Attack on KL Rahul during IND vs ENG 2nd test match: ఇండియా vs ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొంత మంది ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్ ఫీల్డింగ్ చేస్తోన్న కె.ఎల్. రాహుల్‌పై శాంపేన్, విస్కీ బాటిల్ మూతలతో దాడికి పాల్పడ్డారు. రెండో టెస్టులో మూడో రోజైన శనివారం మ్యాచ్ జరుగుతుండగా.. థర్డ్ మ్యాన్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న కె.ఎల్. రాహుల్‌పై ఇంగ్లాండ్ ఫ్యాన్స్ శాంపేన్, బీర్ బాటిల్స్ కార్క్స్‌తో దాడికి దిగారు. ఇంగ్లాండ్ ఫ్యాన్స్ తీరుపట్ల టీమిండియాతో పాటు టీమిండియా ఫ్యాన్స్‌ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కె.ఎల్. రాహుల్ ఫీల్డింగ్ చేస్తున్న చోట అతడి చుట్టు పక్కల కార్క్స్ పడి ఉండటం ఆ ఫోటోల్లో, వీడియోల్లో చూడవచ్చు. మక్కా ఆఫ్ క్రికెట్‌గా పేరున్న లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ దాడి ఘటన ఇంగ్లాండ్‌కి సైతం తలవంపులు తెచ్చింది.
Virat Kohli signaling to KL Rahul to throw it back to the crowd pic.twitter.com/OjJkixqJJA
— Pranjal (@Pranjal_King_18) August 14, 2021
Also read : KL Rahul test century: ఇండియా vs ఇంగ్లండ్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ
ఇదిలావుంటే, కెఎల్ రాహుల్‌కి ఎదురైన చేదు అనుభవంపై టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ధీటుగా జవాబిచ్చాడు. కేఎల్ రాహుల్ వైపు చూస్తూ.. ఆ శాంపేన్ కార్క్స్ (champagne corks), విస్కీ బాటిల్ మూతలను (Whiskey bottle's corks) తిరిగి వాళ్లపైకే విసిరికొట్టాల్సిందిగా విరాట్ కోహ్లీ (Virat Kohli) సైగలు చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Racist abuses during the first test match, now throwing a champagne bottle cork at KL Rahul..
Pathetic English fans. #ENGVIND #INDVENG pic.twitter.com/dk8gCRIYeA— Sneha ✨ (@louist____28) August 14, 2021
స్టేడియంలో ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్ దుష్ర్పవర్తన పట్ల టీమిండియా ఆటగాళ్లు అంపైర్లకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
Englishmen threw Whiskey bottle's cork at KL Rahul at boundary but Indian commentators didn't criticize Britishers for shameful act
If same thing were happened at Indian ground, Our commentators would've cried for Cultural, Upbringing & education for Indians#INDvsENG #ENGvIND
— Farrago Abdullah (@abdullah_0mar) August 14, 2021
Also read: Cricket in Olympics: క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్..2028 ఒలింపిక్స్‌లో జెంటిల్ మెన్ గేమ్!
భారత్ vs ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మూడో రోజు (IND vs ENG 2nd test match day 3) ఆట సందర్భంగా లార్డ్స్ మైదానంలో కె.ఎల్. రాహుల్‌పై (KL Rahul) దాడి జరుగుతున్నా ఇండియన్ కామెంటేటర్స్ ఇంగ్లండ్‌ని విమర్శించలేదని.. ఒకవేళ ఇదే ఘటన భారత గడ్డపై జరిగి ఉంటే.. ఇండియన్స్‌కి చదువు లేదు. సంస్కృతి లేదు అంటూ మన కామెంటేటర్స్ ఇష్టం వచ్చినట్టు నోరుపారేసుకునే వాళ్లేనని ఓ నెటిజెన్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook