Cricket In Olympics: క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. గతంలో 1900లో పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేశారు. కానీ అనంతరం దానిని కొనసాగించలేదు. తాజాగా ఈ ఆంశం మరోసారి తెరపైకి వచ్చింది.
2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్(Los Angeles Olympics)లో మనం క్రికెట్(Cricket)ను కూడా చూడొచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. క్రికెట్‌ను చేర్చేందుకు బిడ్ దాఖలు చేయనుంది. ఇందుకోసం ఐసీసీ ఒలింపిక్ వర్కింగ్ గ్రూప్(ICC Olympic Working Group)ను ఏర్పాటు చేసింది. ‘విశ్వవ్యాప్తమైన క్రికెట్‌ను ఒలింపిక్(Olympics) విశ్వక్రీడల్లోనూ చూడాలనుకుంటున్నాం. క్రికెట్ కు ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మందికి పైగా అభిమానులున్నారు. ఇందులో 90 శాతం మంది క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూడాలనుకుంటున్నారు’ అని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే(Greg Barclay) వ్యాఖ్యానించారు.
Also Read: Neeraj Chopra: నెట్టింట్లో వైరల్ అవుతున్న నీరజ్ చోప్రా వీడియో
బర్మింగ్‌హాంలో జరిగే 2022 కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games)లో మహిళల క్రికెట్(Women Cricket)ను చేర్చారు. అయితే ఇంతకముందు ఈ క్రీడల్లో క్రికెట్ 1998లో ఒకసారి ఆడించిన విషయం తెలిసిందే. ఇక ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చీఫ్ ఇయాన్ వాట్మోర్ నేతృత్వంలో ఐసీసీ ఒలింపిక్ వర్కింగ్ గ్రూప్ పనిచేస్తుంది. ఇందులో ఐసీసీ స్వతంత్ర డైరెక్టర్ ఇంద్రనూయి(Indranui), తవెంగ్వా ముకులని (జింబాబ్వే), మహీంద్ర వల్లిపురం (ఆసియా క్రికెట్ మం డలి), పరాగ్ మరాఠే (అమెరికా) సభ్యులుగా ఉన్నారు.
నిజం చెప్పాలంటే ఒలింపిక్స్(Olympics)లో క్రికెట్ చేర్చేందుకు బీసీసీఐ(BCCI) ఇన్నాళ్లు ససేమిరా అనడంతో అడుగు ముందుకు పడలేదు. ఒలింపిక్ సంఘం గొడుకు కిందికి వస్తే తమ స్వయం ప్రతిపత్తికి ఎక్కడ ఎసరు వస్తుందని బీసీసీఐ భావించింది. కానీ ఇటీవల బీసీసీఐ కార్య దర్శి జై షా(Jai Shah) సుముఖత వ్యక్తం చేయడంతో ఐసీసీ(ICC) చకచకా పావులు కదుపుతోంది. ఇక ఎనిమిది టీమ్‌ల మధ్య పోరు ఉండనున్నట్లు భావిస్తున్నారు. అలాగే ఫార్మట్ విషయానికొస్తే టీ 20 లేదా టీ 10లను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook