Sourav Ganguly backs Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే. సునాయాసంగా హాఫ్ సెంచరీ, సెంచరీలు చేసే కోహ్లీ.. ఇటీవల తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరుతున్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడపాదడపా ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయడం లేదు. ఇక ఇంగ్లండ్ గడ్డపై నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 43 పరుగులే చేశాడు. దాంతో మాజీల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ కూడా అన్నారు. ఇతర దేశ దిగ్గజాలు కూడా కోహ్లీపై విమర్శల వర్షం కురిపించారు. అయితే సునీల్ గవాస్కర్ గవాస్కర్, శరణ్ దీప్ సింగ్ సహా కెప్టెన్ రోహిత్ శర్మ మద్దుతుగా నిలిచారు. కోహ్లీ ఫామ్‌లేమి తాత్కాలికమేనని పేర్కొన్నారు. ఇప్పుడు కోహ్లీకి మద్దతుగా బీసీసీఐ బాస్, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ కూడా నిలిచారు. ఆటలో గడ్డు పరిస్థితులు వస్తుంటాయని, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ సహా తాను ఇలాంటి దశను ఎదుర్కొన్నానన్నారు.
తాజాగా సౌరవ్ గంగూలీ వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ... 'అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ చేసిన పరుగులు చూస్తే.. అతడి సామర్థ్యం, ఆటలో నాణ్యత ఏంటో తెలిసిపోతుంది. లేదంటే అన్ని పరుగులు, రికార్డులు సాధ్యం కావు. తన ఆట ఎంత గొప్పగా ఉంటుందో కోహ్లీకి బాగా తెలుసు. విరాట్ గొప్ప ఆటగాడు. అయితే ఇటీవల తన సామర్థ్యానికి తగ్గట్లు ఆడట్లేదనీ అతడికి కూడా బాగా తెలుసు. 13 ఏళ్లుగా భారత జట్టుకు ఆడుతున్న కోహ్లీ మునుపటి ఫామ్‌ను అందుకొని పరుగులు చేస్తాడు. త్వరలోనే ఇది సాధ్యం అవుతుంది' అని అన్నారు.
ఇంగ్లండ్ గడ్డపై ఇప్పటి వరకు ఆడిన మ్యాచులలో విఫలమైన తరవాత విరాట్ కోహ్లీని టీ20ల నుంచి తప్పించాలంటూ మాజీలు కపిల్ దేవ్, వెంకటేశ్ ప్రసాద్ సెలెక్టర్లకు సూచించారు. ఈ విషయంపై సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... 'ఆటలో ఓ ఆటగాడు ఫామ్ కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం సహజం. ప్రతి క్రికెటర్ కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమే. ఇలాంటి దశను సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లతో పాటు నేను ఎదుర్కొన్నా. ఇప్పుడు విరాట్ కోహ్లీకి జరుగుతోంది. భవిష్యత్ క్రికెటర్లకు కూడా ఇలా జరగొచ్చు. అయితే ఒక ఆటగాడిగా అన్నీ విమర్శలు వినాలి, తెలుసుకోవాలి. చివరకు ఆటపైనే ఫోకస్ పెట్టాలి' అని పేర్కొన్నారు.
Also Read: Monsoon Makeup Tips: వానలో తడవడం వల్ల మేకప్ పోతోందా.. అయితే ఇలా చేయండి..!
Also Read: Malavika Mohanan: పొట్టి గౌనులో మాళవిక థైస్ షో.. బెడ్డెక్కి మరీ ఘాటు ముద్దులు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook