India vs Nepal Dream11 Prediction Tips and Pitch Report: ఆసియా కప్ 2023 సూపర్-4లో ఎంట్రీ ఇచ్చేందుకు టీమిండియా నేడు రెడీ అవుతోంది. పసికూన నేపాల్‌తో తలపడనుంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్ రద్దవ్వడంతో భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. అటు నేపాల్ కూడా ఈ మ్యాచ్‌లో ఓడితే ఇంటి ముఖం పట్టనుంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ముందు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. దీంతో షమీ తుది జట్టులోకి రానున్నాడు. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి..? ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారు..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి..? వివరాలు ఇలా..
పిచ్ రిపోర్ట్ ఇలా..
క్యాండీలోని పల్లెకెలె స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. గత మ్యాచ్‌లో పాక్ బౌలర్లు ఆరంభంలో ఇబ్బంది పెట్టినా.. క్రీజ్‌లో కుదురుకుంటే పరుగులు చేయవచ్చని ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా నిరూపించారు. వర్షం కురిస్తే.. పిచ్ నుంచి పేసర్లకు సహాకారం ఉంటుంది. ముఖ్యంగా ఆఫర్‌లో టర్న్, బౌన్స్ కారణంగా కొంచెం ఎక్కువ సహాయం పొందవచ్చు. స్ట్రైక్ రొటేట్ చేయగల బ్యాటర్లు ఈ పిచ్‌పై బాగా రాణించగలరు. టాస్ గెలిచిన జట్లు ఛేజింగ్ ఎంచుకోవచ్చు.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..
వేదిక: పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, శ్రీలంక
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు నుంచి ప్రారంభం
స్ట్రీమింగ్ వివరాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ +హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉచితంగా చూడొచ్చు.
రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
నేపాల్: కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (వికెట్ కీపర్), రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆరిఫ్ షేక్, సోంపాల్ కమీ, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లామిచానే, కరణ్ ఛెత్రి, లలిత్ రాజ్‌బన్షి.
డ్రీమ్11 టీమ్ టిప్స్..
వికెట్ కీపర్లు: ఇషాన్ కిషన్, ఆసిఫ్ షేక్
బ్యాట్స్‌మెన్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ పౌడెల్
ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా, దీపేంద్ర సింగ్ ఐరీ
బౌలర్లు: మహ్మద్ షమీ (వైస్ కెప్టెన్), కుల్దీప్ యాదవ్, సందీప్ లామిచానే
Also Read: PM Kisan Latest Updates: పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఈ మూడు పనులు కచ్చితంగా చేయండి
Also Read: Best Breakfast Foods: మీ శరీరంలో ఇమ్యూనిటీని వేగంగా పెంచే 6 అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
IND Vs NEP Dream11 Prediction Today Match: నేపాల్‌తో టీమిండియా పోరు.. పిచ్ రిపోర్టు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..