పాక్‌లో షాహీన్ ఆఫ్రిది కంటే ప్రమాదకరమైన బౌలర్ ఉన్నాడు.. భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే: ఆకాశ్‌

IND vs PAK, Aakash Chopra Says India need to be wary of Haris Rauf. భారత్ అప్రమత్తంగా ఉండాల్సింది షహీన్‌తో కాదని.. హారిస్‌ రవూఫ్‌తోనే అసలైన సమస్య అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Oct 20, 2022, 11:54 AM IST
  • మరో రెండు రోజుల్లో సూపర్ 12
  • ఆఫ్రిది కంటే ప్రమాదకరమైన బౌలర్ ఉన్నాడు
  • భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే
పాక్‌లో షాహీన్ ఆఫ్రిది కంటే ప్రమాదకరమైన బౌలర్ ఉన్నాడు.. భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే: ఆకాశ్‌

IND vs PAK, Aakash Chopra Says India need to be wary of Haris Rauf: టీ20 ప్రపంచకప్‌ 2022కు సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో సూపర్ 12 ఆరంభం కానుంది. మెహ టోర్నీ మొదటి మ్యాచులో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లు తలపడనున్నాయి. అక్టోబర్‌ 23న భారత్‌, పాకిస్తాన్ జట్లు ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రతిఒక్కరు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచుతో గాయం కారణంగా జట్టుకు దూరమైన పాక్‌ బౌలర్‌ షహీన్‌ షా అఫ్రిది పునరాగమనం చేస్తున్నాడు. దాంతో పాక్ బౌలింగ్ పటిష్టం అయింది. అయితే భారత్ అప్రమత్తంగా ఉండాల్సింది షహీన్‌తో కాదని.. హారిస్‌ రవూఫ్‌తోనే అసలైన సమస్య అని భారత మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

'ఫుల్‌, స్వింగ్, ఫాస్ట్ అన్ని షహీన్‌ అఫ్రిది వేయగలడు. అతడు అత్యుత్తమ ప్రదర్శనకు దగ్గరగా ఆడుతున్నాడు. అఫ్గానిస్తాన్‌ బ్యాటర్‌ రహమనుల్లా గుర్బాజ్‌కు తగిలిన గాయమే ఇందుకు సాక్ష్యం. కానీ టీ20 ప్రపంచకప్‌ 2022లో టీమిండియాను ఇబ్బంది పెట్టేంత ఆటగాడేమీ కాదని నేను అనుకుంటున్నా. భారత జట్టుకు హారీస్‌ రావూఫ్‌ అసలైన ప్రమాదకారి. కఠినమైన ఓవర్లలో బౌలింగ్‌ చేసి.. ఆటలో వైవిధ్యం చూపగల సామర్థ్యం అతడిది' అని కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా చెప్పాడు. 

బుధవారం పాకిస్థాన్ వైస్ అఫ్గానిస్తాన్‌ వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఆకాశ్‌ చోప్రా ట్వీట్ చేశాడు. హారీస్‌ రావూఫ్‌ బౌలింగ్‌లో భారత జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. బుధవారం గబ్బా వేదికగా జరిగిన వార్మప్ మ్యాచ్‌లో షాహీన్ షా అఫ్రిది పాకిస్థాన్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అఫ్గనిస్థాన్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఇద్దరు బ్యాటర్లను షహీన్‌ యార్కర్లతో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఈ మ్యాచులో అతడు 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇదే మ్యాచ్‌లో హారీస్‌ రవూఫ్ 34 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 

Also Read: శారీలో 'అబ్బా' అనిపిస్తున్న హెబ్బా పటేల్.. ఫొటోస్ చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!

Also Read: NBK 107 Title: అన్నగారు ? రెడ్డి గారు? ఆ టైటిల్ కే మొగ్గు చూపుతున్న 107 మేకర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News