IND vs SA: టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌.. రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ అరంగేట్రం! 40 ఓవర్ల మ్యాచ్

IND vs SA, India have won the toss and have opted to field. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లక్నో వేదికగా జరగాల్సిన మొదటి మ్యాచ్‌ రెండు గంటల తర్వాత ప్రారంభం కానుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 6, 2022, 04:04 PM IST
  • టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌
  • రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ అరంగేట్రం
  • 40 ఓవర్ల మ్యాచ్
IND vs SA: టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌.. రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ అరంగేట్రం! 40 ఓవర్ల మ్యాచ్

IND vs SA 1st ODI playing 11, Ruturaj Gaikwad making his ODI debut: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లక్నో వేదికగా జరగాల్సిన మొదటి మ్యాచ్‌ ఎట్టకేలకు ఆరంభం కానుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రెండు గంటల తర్వాత ప్రారంభం కానుంది. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉండగా.. వరుణుడి కారణంగా ఆలస్యమైంది. అంపైర్లు మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచులో టాస్‌ నెగ్గిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు. 

40 ఓవర్ల మ్యాచ్ కాబట్టి ప్రతి బౌలర్‌ గరిష్ఠంగా ఎనిమిది ఓవర్లు మాత్రమే వేయాల్సి ఉంటుంది. తొలి పవర్ ప్లే 8 ఓవర్లు మాత్రమే. ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున యువ ప్లేయర్ రుతురాజ్‌ గైక్వాడ్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత ప్రధాన జట్టు టీ20 ప్రపంచకప్‌ 2022 ఆడేందుకు నేడు ఆస్ట్రేలియాకు వెళ్లింది. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అలానే యువ ప్లేయర్స్ జట్టులోకి వచ్చారు. 

తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్‌ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ (కీపర్), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేశ్‌ ఖాన్, మొహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్. 
దక్షిణాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్‌, డేవిడ్ మలన్, ఐడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, తబ్రైజ్ షంసి, లుంగి ఎంగిడి. 

Also Read: వెస్టిండీస్ బాహుబలి విధ్వసం.. టీ20ల్లో డబుల్ సెంచరీ! 77 బంతుల్లో 205 రన్స్

Also Read: తల్లిపై రాహుల్ గాంధీ ప్రేమ.. పాదయాత్రలో సోనియా గాంధీ 'షూ' లేస్ కట్టిన రాహుల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News