Ind vs SA: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, 3 పరుగులకే 2 వికెట్లు

Ind vs SA: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. తమిళ బ్యాటర్ సాయి సుదర్శన్ తొలిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 17, 2023, 02:03 PM IST
Ind vs SA: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, 3 పరుగులకే 2 వికెట్లు

Ind vs SA: జోహాన్నెస్‌బర్గ్ వేదికగా న్యూ వాండరర్స్ స్డేడియంలో ఇండియా సౌత్ ఆఫ్రికా తొలి వన్డే సిరీస్ ప్రారంభమైంది. టీ20 సిరీస్ 1-1తో సమం చేసిన తరువాత అటు ఇండియా, ఇటు దక్షిణాఫ్రికా జట్లు వన్డే సిరీస్‌పై కన్నేశాయి. టీమ్ ఇండియా కేఎల్ రాహుల్ నేతృత్వంలో బరిలో దిగగా దక్షిణాఫ్రికా మార్పులు చేర్పులతో మరోసారి మార్క్‌రమ్ కెప్టెన్సీలో రంగంలో దిగింది. రెండు జట్ల తరపున ఇద్దరు ఆటగాళ్లు తొలిసారిగా అంతర్జాతీయ మ్యాచ్‌లో డెబ్యూ చేస్తున్నారు. టీమ్ ఇండియా తరపున తమిళనాడుకు చెందిన యువ క్రికెటర్ సాయి సుదర్శన్ డెబ్యూ చేస్తుంటే.. దక్షిణాఫ్రికా తరపున పేసర్ బర్గర్ ఆరంగేట్రం చేస్తున్నాడు. 

న్యూ వాండరర్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా రధ సారధి మార్క్‌రమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే చుక్కెదురైంది. మొదటి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి సౌత్ ఆఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 3 పరుగులకే 2 వికెట్లు పోగొట్టుకుంది. రస్సీ డస్సెన్, హెన్డ్రిక్స్ వికెట్లు పోగొట్టుకుంది. ముకేశ్ కుమార్ తొలి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

టీమ్ ఇండియా ప్లేయింగ్ 11

కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజూ శామ్సన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముకేష్ యాదవ్

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11

టోనీ డిజోర్జి, రీజా హెండ్రిక్స్, రస్సీ వాండెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్దర్, ఫెలూక్వాయో, కేశవ్ మహారాజ్, బర్గర్, తబ్రేజ్ షమ్సి

Also read: Nagpur Blast: నాగ్‌పూర్ కంపెనీలో పేలుడు, 9 మంది మృతి, కొనసాగుతున్న రెస్క్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News