India Vs South Africa Toss Updates and Playing 11: సిరీస్‌లో కీలకమైన మూడో, చివరి వన్డేలో బిగ్‌ఫైట్‌కు భారత్, దక్షిణాఫ్రికా రెడీ అయ్యాయి. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమి పాలైంది. దీంతో సిరీస్ 1-1 సమం అయింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న సాయి సుదర్శన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 55, 62 పరుగులతో ఆకట్టుకున్నాడు. సుదర్శన్‌కు తోడు మిగిలిన బ్యాట్స్‌మెన్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది. శ్రేయాస్ అయ్యర్ టెస్టు జట్టుతో చేరడంతో మిడిల్ ఆర్డర్ బలహీనంగా మారింది. తిలక్ వర్మ, రింకూ సింగ్ అంచనాలకు మించి రాణించాల్సిన అవసరం ఉంది. టెస్టు సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని రెండు జట్లు భావిస్తున్నాయి. బోలాండ్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా రెండు మార్పులు చేసింది. రజత్ పాటిదార్ వన్డేల్లో అరంగేట్రం చేయగా.. కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతోంది.
"మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. మంచి వికెట్ లాగా ఉంది. పెద్దగా మారదు. మనల్ని మనం సవాలు చేసుకుంటూ ఉండాలి. మేము క్రమం తప్పకుండా వికెట్లు తీస్తే.. తక్కువ స్కోరుకే కట్టడి చేయగలం. మ్యాచ్‌లో మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ బౌండరీలు చాలా లాంగ్ ఉన్నాయి. వికెట్ల మధ్య కఠినంగా పరుగెత్తడం కీలకం. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడనున్నాం.." అని సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్ అని తెలిపాడు.
"మొదట బ్యాటింగ్ చేయడం మాకు పెద్దగా ఇబ్బంది లేదు. వికెట్ రెండు ఇన్నింగ్స్‌లకు సమానంగా ఉంటుంది. ఇక్కడ లైట్లు చాలా ఆలస్యంగా వెలుగుతాయి. గత మ్యాచ్‌లో బాగానే ఆడాం. కానీ 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయాము. మంచి ఆరంభం దక్కిన తరువాత అది కంటిన్యూ చేయాలి. కుర్రాళ్లకు తమను తాము నిరూపించుకోవడానికి ఈరోజు మరో అవకాశం. ఇది గత రెండు వికెట్ల కంటే మెరుగైన వికెట్ లాగా కనిపిస్తోంది. రజత్ పాటిదార్ వన్డే అరంగేట్రం చేశాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు వేలికి గాయం కావడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కుల్దీప్‌కి విశ్రాంతి ఇచ్చాం. వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు.." అని టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.
తుది జట్లు ఇలా..
భారత్: రజత్ పాటిదార్, సాయి సుదర్శన్, సంజు శాంసన్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, కెప్టెన్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్.