IND vs SL: టీమిండియాదే బ్యాటింగ్.. ఇషాన్‌, సూర్యకు దక్కని చోటు! తుది జట్టు ఇదే!

India vs Sri Lanka 1st ODI Playing 11 Out. భారత్, శ్రీలంక జట్ల మధ్య మరికాసేపట్లో గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో తోలి వన్డే జరగనుంది. ఈ మ్యాచులో టాస్‌ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక బౌలింగ్‌ ఎంచుకొన్నాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 10, 2023, 01:40 PM IST
  • భారత్‌, శ్రీలంక తొలి వన్డే
  • టీమిండియాదే బ్యాటింగ్
  • ఇషాన్‌, సూర్యకు దక్కని చోటు
IND vs SL: టీమిండియాదే బ్యాటింగ్.. ఇషాన్‌, సూర్యకు దక్కని చోటు! తుది జట్టు ఇదే!

IND vs SL 1st ODI Playing 11 Out: Virat Kohli, Rohit Sharma, Mohammed Shami back: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న భారత్.. ఇక వన్డే సమరానికి సిద్ధమైంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య మరికాసేపట్లో గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో తోలి వన్డే జరగనుంది. ఈ మ్యాచులో టాస్‌ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక బౌలింగ్‌ ఎంచుకొన్నాడు. దీంతో రోహిత్ సేన మొదట బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు.

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌, మొహ్మద్ షమీ భారత జట్టులోకి వచ్చేశారు. క్రమంలో స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులపైనే కన్నేయడం విశేషం. యువ జట్టుతో టీ20 సిరీస్‌ను దక్కించుకొన్న భారత్.. వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేయాలని ఎదురు చూస్తోంది.

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్యా, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్, మొహ్మద్ షమీ, యుజ్వేంద్ర చహల్‌. 
శ్రీలంక: పాతున్‌ నిస్సాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డిసిల్వ, చరిత్ అసలంక, డాసున్ శనక (కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, దునిల్ వెల్లలాగే, కసున్ రజిత, దిల్షాన్ మదుషంక . 

Also Read: TVS Metro Plus 110: టీవీఎస్ సరికొత్త బైక్‌.. సామాన్యులకు అందుబాటు ధర! సూపర్ మైలేజ్

Also Read: Best Selling Sedan Car: బ్రెజా, పంచ్, క్రెటా లాంటి ఎస్‌యూవీలను కాకుండా.. ఈ చౌకైన సెడాన్‌ను ఎగబడి కొంటున్నారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News