India Vs Sri Lanka 2nd Test Live Score: శ్రీలంకతో (Srilanka) జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ (India) 252 పరుగులకే ఆలౌటయ్యింది. టీమిండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యరే (Shreyas Iyer) ఒక్కడే రాణించాడు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. రిషబ్ పంత్, హనుమ విహరి పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు ఎవరూ లంక బౌలర్ల ముందు నిలవలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ధనంజయ 2, సురంగా లక్మల్ 1 వికెట్ చొప్పున తీశారు.
డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. రోహిత్ శర్మ (Rohit Sharma), మయాంక అగర్వాల్ ఓపెనర్లుగా వచ్చారు. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మయాంక్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం రోహిత్ కు విహారి జత కలిశాడు. ఇద్దరూ కొద్దిసేపు నిలకడగా ఆడారు. తొమ్మిది ఓవర్ లో టీమిండియాకు షాక్ తగిలింది. రోహిత్ 15 పరుగులు చేసి క్యాచ్ ఔటయ్యాడు. విహారి, కోహ్లీ ఆచితూచి ఆడుతూ...స్కోరు బోర్డును పరుగులెట్టించారు. కాసేపటికే 31 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద విహారి ఔటయ్యాడు. వచ్చిరాగానే రిషబ్ పంత్ రెండు ఫోర్లు బాదాడు. తర్వాత టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. 23 పరుగులు చేసి కోహ్లీ ఔటయ్యాడు. టీ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది భారత్.
పంత్ కు జత కలిసిన శ్రేయస్ ఆచితూచి ఆడాడు. కానీ పంత్ మాత్రం దూకుడు పెంచాడు. ఎడపెడా బౌండరీలు బాదాడు. చివరకు లసిత్ ఎంబుల్దెనియాకు చిక్కాడు. అతడి బౌలింగ్ లో బౌల్డయ్యాడు. రవీంద్ర జడేజా కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. శ్రేయస్ మాత్రం ఒంటరి పోరాటం కొనసాగించాడు. ఆశ్విన్ అండగా నెమ్మదిగా స్కోరును పెంచాడు. ఆశ్విన్ ఔటయ్యిన తర్వాత తన అర్థ సెంచరీని పూర్తిచేసుకున్నాడు అయ్యర్. డిసిల్వా ఓవర్లో రెండు సిక్స్ లు బాదాడు. చివరి ఆటగాళ్లను అడ్డుపెట్టుకుని స్కోరు బోర్డును పరుగులెట్టించాడు శ్రేయస్. తృటిలో సెంచరీని చేజార్చుకుని చివరి వికెట్ కు వెనుదిరిగాడు అయ్యర్ (92: 98 బంతుల్లో 10×4, 4×6).
Also Read: India vs West Indies: ప్రపంచకప్ లో భారత్ జోరు.. వెస్టిండీస్ పై ఘన విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook