IND Vs WI 2nd T20 Updates: టాస్ గెలిచిన భారత్.. స్టార్ ప్లేయర్ దూరం.. ఆ స్పిన్నర్‌కు ఛాన్స్..!

India Vs West Indies 2nd T20 Toss and Playing 11:: వెస్డిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు టీమిండియా రెడీ అయింది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది కరేబియన్ జట్టుకు చెక్ పెట్టడంతోపాటు సిరీస్‌లో బోణీ కొట్టాలని టీమిండియా చూస్తోంది. టాస్ గెలిచిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కుల్దీప్ యాదవ్ గాయం కారణంగా దూరమవ్వగా.. రవి బిష్ణోయ్‌కు ఛాన్స్ దక్కింది.  

Last Updated : Aug 6, 2023, 07:59 PM IST
IND Vs WI 2nd T20 Updates: టాస్ గెలిచిన భారత్.. స్టార్ ప్లేయర్ దూరం.. ఆ స్పిన్నర్‌కు ఛాన్స్..!

India Vs West Indies 2nd T20 Toss and Playing 11: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో మ్యాచ్‌ ఆదివారం జరుగుతోంది. మొదటి మ్యాచ్‌లో ఓడిన భారత్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించిన భారత్.. బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. 150 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది.

అటు టెస్టు, వన్డే సిరీస్‌ల్లో ఓడిపోయినా.. టీ20 సిరీస్ ఫస్ట్ మ్యాచ్‌లో కరేబియన్ జట్టు సూపర్ పర్ఫామెన్స్ చేసింది. స్లో పిచ్‌పై తక్కువ టార్గెట్‌ను ఛేదించకుండా భారత బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేశారు. ఇక రెండో మ్యాచ్‌లోనూ అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలని చూస్తోంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా రెండో టీ20 మ్యాచ్‌లో రెండు జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్టోయ్‌కు తుది జట్టులో చోటు దక్కింది. మొదటి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే విండీస్ బరిలోకి దిగుతోంది.

 

"మేము ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ బాగుంది. బోర్డుపై మంచి స్కోరును ఉంచుతాం. చివరి గేమ్‌లో చాలా తప్పులు చేశామని నేను అనుకోవట్లేదు. మేము దాని గురించి ఎక్కువగా మాట్లాడాలని అనుకోవట్లేదు ఓటమి నుంచి నేర్చుకుని ముందుకు సాగడంపై దృష్టి పెట్టాం. ఓవర్‌కి 9 లేదా 10 పరుగులను ఛేజింగ్ చేసే సమయంలో వికెట్లను చేతిలో ఉంచుకోవాలి. లాస్ట్ మ్యాచ్‌లో కొన్ని వికెట్లు కోల్పోయాం నెట్స్‌లో నిన్న కుల్దీప్ చేతికి దెబ్బ తగిలింది. ఇది అంత సీరియస్ కాదు. కేవలం ముందుజాగ్రత్త చర్యగా విశ్రాంతి ఇచ్చాం. అతని స్థానంలో రవి బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకున్నాం.." అని టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తెలిపాడు.

"పిచ్ చాలా మంచిగా కనిపిస్తోంది. మ్యాచ్ సాగే కొద్ది మరింత మెరుగుపడుతుంది. చూడటానికి బాగానే ఉన్నా లాస్ట్ మ్యాచ్‌లో మేం క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయాం. మేము ఆటగాళ్లుగా ఎదిగాం. బ్యాటింగ్ యూనిట్‌ను మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళతాం. మొదటి మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నాం.." అని విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ చెప్పాడు.

తుది జట్లు ఇలా..

భారత్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, రవి బిష్ణోయ్

వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హిట్‌మేయర్, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.

Also Read: Gaddar Passed Away: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత.. విషాదంలో తెలంగాణ లోకం  

Also Read: East Godavari Road Accident: ఫ్రెండ్‌షిప్ రోజు ఘోర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News