Shikhar Dhawan Captain: టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. వైస్‌ కెప్టెన్‌గా..!

IND vs WI ODI Squad 2022, Shikhar Dhawan Named as India Captain. వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ సెలెక్టర్లు జట్టును ప్రకటించారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 6, 2022, 04:59 PM IST
  • వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌
  • టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్
  • వైస్‌ కెప్టెన్‌గా
Shikhar Dhawan Captain: టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. వైస్‌ కెప్టెన్‌గా..!

BCCI announce India ODI Squad for West Indies: ఈ నెలాఖరులో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించారు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

ఈ సిరీస్ నుంచి స్టార్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్‌, జస్ప్రీత్ బుమ్రాలకు రెస్ట్ ఇచ్చారు. రోహిత్ గైహాజరీలో ఈ వన్డే జట్టును శిఖర్ ధావన్ ముందుండి నడిపించనున్నాడు. గతంలో శ్రీలంకతో సిరీస్‌ నేపథ్యంలో శిఖర్‌ ధావన్‌ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. 

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో సెంచరీ చేసిన దీపక్‌ హుడా విండీస్‌తో వన్డేలకు ఎంపికయ్యాడు. సంజూ శాంసన్‌ సైతం చోటు దక్కించుకున్నాడు. యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కు కూడా భారత జట్టులో అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఆపై ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జులై 17న ముగుస్తుంది. అనంతరం జులై 22న ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్‌ పర్యటనకు భారత్ వెళుతుంది.  అనంతరం 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆగస్టు 7న ముగియనుంది. 

షెడ్యూల్‌:
జూలై 22- మొదటి వన్డే
జూలై 24- రెండో వన్డే
జూలై 27- మూడో వన్డే
మొదటి టీ20- జూలై 29
రెండో టీ20- ఆగష్టు 1
మూడో టీ20- ఆగష్టు 2
నాలుగో టీ20- ఆగష్టు 6
ఐదో టీ20- ఆగష్టు 7
 

భారత జట్టు:
శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), శార్దూల్‌ ఠాకూర్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

Also Read: ENG vs IND Playing XI: రోహిత్ ఇన్.. బుమ్రా ఔట్! తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే

Also Read: Fraud Case: హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన మరో కంపెనీ..లబోదిబోమంటున్న బాధితులు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News