భారత్ లక్ష్యం 287 పరుగులు

బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ముగిసింది. ఆస్ట్రేలియా నిర్ణిత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ జట్టు ఆదిలోనే వార్నర్‌ (3), ఫించ్‌ (19) వికెట్లు కోల్పోయింది.

Updated: Jan 19, 2020, 05:44 PM IST
భారత్ లక్ష్యం 287 పరుగులు

హైదరాబాద్‌ : బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ముగిసింది. ఆస్ట్రేలియా నిర్ణిత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ జట్టు ఆదిలోనే వార్నర్‌ (3), ఫించ్‌ (19) వికెట్లు కోల్పోయింది. 

దీంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాద్యతను స్మిత్‌ తీసుకున్నాడు. స్మిత్‌ (131) సెంచరీ సాధించగా లబుషేన్‌ 54 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. జట్టుకు కీలకమైన సమయంలో క్యాచ్‌ అందుకుని ఆసీస్‌ జట్టును దెబ్బతీశాడు. క్యారీ 35 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమి నాలుగు వికెట్లు తీయగా జడేజా రెండు వికెట్లు తీశాడు. సైని, కుల్దీప్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..