India vs Australia 4th Test Day 1 Highlights: బోర్డర్-గవాస్కర్ సిరీస్ దక్కించుకోవాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన చివరిదైన నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఆతిథ్య ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. శుక్రవారం ఉదయం గబ్బాలో ప్రారంభమైన నాలుగో టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆసీస్ టాలెంటెడ్ క్రికెటర్ మార్నస్ లబుషేన్(108; 208 బంతుల్లో 9 ఫోర్లు) శతకం సాధించి ఆసీస్ ఇన్నింగ్స్‌ను నెలబెట్టాడు. భారత బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రధాన పేస్ బౌలర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. అంతకుముందు టాస్ నెగ్గిన ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్‌కు బౌలర్లు శుభారంభాన్ని ఇవ్వగా దాన్ని చివరివరకూ నిలుపుకోలేకపోయారు. తొలుత 4 పరుగులకే ఓపెనర్ డేవిడ్ వార్నర్(1) వికెట్‌ను కోల్పోయింది ఆస్ట్రేలియా. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) చేతికి చిక్కడంతో నిరాశగా వెనుదిరిగాడు వార్నర్. మరో ఓపెనర్ మార్కస్ హారిస్(5)ను టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు.
Also Read: Devdutt Padikkal టీమిండియాలోకి రావడం ఖాయమేనా?
దీంతో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(36; 77 బంతుల్లో 5 ఫోర్లు) సహకారంతో లబుషేన్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అయితే మూడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం జత చేసిన తర్వాత వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో స్మిత్ ఔటయ్యాడు. భారత(Team India) ఓపెనర్ రోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంతో మూడో వికెట్ కోల్పోయింది ఆసీస్.
Also Read: Jacques Kallis: జాతీయ జట్టుకు జీవితంలో కోచ్ కాలేడు.. కారణమేంటో తెలుసా?
మాథ్యువేడ్(45; 87 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు లబుషేన్. రెండో సెషన్‌లో వికెట్ పడకుండా ఈ జంట జాగ్రత్త పడింది. ప్రమాదకరంగా మారుతున్న సమయంలో యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ వీరిద్దరని పెవిలియన్ బాట పట్టించాడు.
An unbeaten 61-run stand between skipper Tim Paine and Cameron Green takes Australia to 274/5 at stumps on day one of the Brisbane Test.#AUSvIND scorecard ⏩ https://t.co/oDTm20rn07 pic.twitter.com/0q8FR7j9TX
— ICC (@ICC) January 15, 2021
తొలుత మాథ్యూ వేడ్‌ను ఔట్ చేసిన నటరాజన్, ఆ తర్వాత లబుషేన్ వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా కెప్టెన్ టీమ్ పైన్(38 నాటౌట్; 62 బంతుల్లో 5 ఫోర్లు) కామెరూన్ గ్రీన్(28 నాటౌట్; 70 బంతుల్లో 3 ఫోర్లు) ఆటను కొనసాగిస్తున్నారు.
Also Read: Steve Smith నిజంగానే తప్పిదం చేశాడా.. తేల్చేసిన Full Video
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook