Devdutt Padikkal టీమిండియాలోకి రావడం ఖాయమేనా?

Syed Mushtaq Ali Trophy: Devdutt Padikkal Slams Unbeaten 99 Against Tripura Helps Karnataka Win: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో పరుగుల వరద పారిస్తున్నారు యువ క్రికెటర్లు దేవదత్ పడిక్కల్, అభిషేక్ శర్మ. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2020)లో అరంగేట్రం చేసి సత్తా చాటాడు యువ ఓపెనర్ బ్యాట్స్‌మన్ దేవదత్ పడిక్కల్.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 14, 2021, 07:11 PM IST
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో పరుగుల వరద పారిస్తున్నారు యువ క్రికెటర్లు
  • IPL 2020లో అరంగేట్రం చేసి సత్తా చాటాడు యువ ఓపెనర్ బ్యాట్స్‌మన్ దేవదత్ పడిక్కల్
  • ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ మెరుగైన ప్రదర్శన చేస్తున్న యువ ఓపెనర్
Devdutt Padikkal టీమిండియాలోకి రావడం ఖాయమేనా?

Syed Mushtaq Ali Trophy: Devdutt Padikkal Slams Unbeaten 99 Against Tripura Helps Karnataka Win: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో పరుగుల వరద పారిస్తున్నారు యువ క్రికెటర్లు దేవదత్ పడిక్కల్, అభిషేక్ శర్మ. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2020)లో అరంగేట్రం చేసి సత్తా చాటాడు యువ ఓపెనర్ బ్యాట్స్‌మన్ దేవదత్ పడిక్కల్. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఫామ్ ఇలాగే కొనసాగిస్తే టీమిండియా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం అంత కష్టమేమీ కాదు.

గురువారం ఆటలో పంజాబ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ 62 బంతుల్లో 107 పరుగులతో శతకం సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్(Devdutt Padikkal) 67 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ శతకం సాధించడంతో 20 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

Also Read: Jacques Kallis: జాతీయ జట్టుకు జీవితంలో కోచ్ కాలేడు.. కారణమేంటో తెలుసా!

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy)లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో దినేష్ మోర్ కెప్టెన్సీలోని రైల్వేస్ జట్టు 83 పరుగులు చేసి 117 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్(4/22), అర్షదీప్ సింగ్(3/16) మ్యాజిక్ చేయడంతో రైల్వేస్ వద్ద సమాధానం లేకపోయింది.

Also Read: Steve Smith నిజంగానే తప్పిదం చేశాడా.. తేల్చేసిన Full Video 

 

 

పడిక్కల్ అజేయ అర్ధశతకం సాధించడంతో కర్ణాటక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167/5 చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన త్రిపుర 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. త్రిపుర కెప్టెన్ మణిశంకర్ మురాసింగ్, రజత్ దే 5వ వికెట్‌కు 89 పరుగులు జోడించారు చివరి వరకూ క్రీజులో ఉన్నా త్రిపురకు విజయాన్ని అందించలేకపోయారు.

Also Read: Saina Nehwal: స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, ప్రణయ్‌లకు కరోనా.. థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి ఔట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News