IND vs ENG 01st Test Live Score: హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్లు అదరగొడుతున్నారు. అశ్విన్, జడేజా ధాటికి ఇంగ్లీష్ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. అశ్విన్ కు రెండు, జడేజాకు ఒక వికెట్ లభించింది.
ముందుగా టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. అతడి నమ్మకాన్ని నిలబెడుతూ జాక్ క్రాలే(18), బెన్ డకెట్(35) తొలి వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న జోడిని అశ్విన్ విడదీశాడు. అశ్విన్ తన రెండో ఓవర్లో డకెట్‌ను ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు పంపాడు. కాసేపటికే జడేజా అద్భుతమైన డెలివరీతో ఓలీ పోప్(1)ను బోల్తా కొట్టించాడు. దాంతో 58 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ ను కోల్పోయింది. క్రీజులో పాతుకుపోతున్న ఓపెనర్ జాక్ క్రాలే(20) అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సిరాజ్ కళ్లుచెదిరే క్యాచ్ అందుకోవడంతో క్రాలే పెవిలియన్ చేరక తప్పలేదు.
Also Read: ICC Awards: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్.. వరుసగా రెండోసారి ఐసీసీ అవార్డుకు ఎంపిక..
Another for Ashwin as Crawley steps down and Siraj takes a good catch at mid-off #INDvENG
▶️ https://t.co/ScJisUw7M1 pic.twitter.com/eJP8bzJ9sx
— ESPNcricinfo (@ESPNcricinfo) January 25, 2024
భారత్: రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (వికె), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్: బెన్ స్టోక్స్ (సి), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వాక్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్ మరియు జాక్ లీచ్.
Also read; Ind vs Eng Test: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్ట్ నేడే, పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి