IND vs SA: టీమిండియాదే ఫస్ట్ బ్యాటింగ్.. హైదరాబాద్ పేసర్‌కు నిరాశే! తుది జట్లు ఇవే

India vs South Africa 2nd T20 Playing 11 Out. దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Oct 2, 2022, 06:56 PM IST
  • టీమిండియాదే ఫస్ట్ బ్యాటింగ్
  • హైదరాబాద్ పేసర్‌కు నిరాశే
  • భారత్ vs దక్షిణాఫ్రికా తుది జట్లు ఇవే
IND vs SA: టీమిండియాదే ఫస్ట్ బ్యాటింగ్.. హైదరాబాద్ పేసర్‌కు నిరాశే! తుది జట్లు ఇవే

India vs South Africa 2nd T20 Playing 11 Out: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో గువాహటిలో రెండో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేసినట్టు ప్రొటీస్ కెప్టెన్ తెలిపాడు. షంసి స్థానంలో లుంగి ఎంగిడి జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ తొలి టీ20లో ఆడిన జట్టుతోనే ఆడుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 

మూడు టీ20ల ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఈ మ్యాచులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని దక్షిణాఫ్రికా జట్టు భావిస్తోంది. దాంతో రెండో టీ20 పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. తొలి టీ20లో ఘన విజయంతో మంచి జోష్‌ మీదున్న రోహిత్‌ సేన ఈ మ్యాచులో ఎలా ఆడుకుతుందో చూడాలి. 

తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేశ్‌ కార్తిక్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చహర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌. 
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్‌, టెంబా బవుమా (కెప్టెన్), రిలీ రిసోవ్, ఐదెన్ మార్‌క్రమ్‌, డేవిడ్ మిల్లర్‌, ట్రిస్టన్ స్టబ్స్, వ్యాన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, ఆన్రిచ్ నోర్జ్, లుంగి ఎంగిడి. 

Also Read: Shanidev Signs: జీవితంలో ఈ సంఘటనలు జరుగుతున్నాయా.. మీపై శని దేవుని ప్రభావం ఉన్నట్లే!

Also Read: Diwali 2022: మాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహం.. దీపావళి అనంతరం ఈ 6 రాశుల వారికి అదృష్టమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News