జైత్రయాత్రకు బ్రేక్; రెండో టెస్టులో కోహ్లీసేన ఓటమి

సొంతగడ్డపై విజయాల మీద విజయాలు సాధించిన కోహ్లీసేన విదేశాల్లో మాత్రం మరోసారి తేలిపోయింది

Last Updated : Jan 17, 2018, 07:36 PM IST
జైత్రయాత్రకు బ్రేక్; రెండో టెస్టులో కోహ్లీసేన ఓటమి

టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది. దీంతో సిరీస్ 2-0 తేడాతో పరాజయం పాలైంది.  ఆతిథ్య జట్టు నిర్దేశించిన 287 పరుగుల లక్ష్య ఛేదనలో  కోహ్లీసేన పరుగులకే  151 పరుగులకు (50.2 ఓవర్లకు) కుప్పకూలింది. దీంతో 135 పరుగుల తేడాతో సఫారీలు గెలుపొందినట్లయింది. 

టపటప వికెట్లు పడుతున్న తరుణంలో కాసేపు రోహిత్ శర్మ అడ్డుగోడగా నిలిచి ప్రేక్షకులను అలరించాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ దాడికి ప్రతిదాడి వ్యూహంతో ఆడాడు. అయితే అర్థ సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు (47) రబాడ పెవిలియన్‌ పంపించాడు.  ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగడంతో ఆట దాదాపు ముగిసినట్టైంది. ఆ తర్వాత నాలుగు పరుగుల తేడాతో మహ్మద్‌ షమి (28) భారీ షాట్‌ ఆడబోయి ఔట్ అయ్యాడు. ఇక 151 వద్ద బుమ్రా (2) ఔట్‌ కావడంతో భారత్‌ పని ముగిసింది. 

దీంతో మూడు మ్యాచ్‌ల ఫ్రీడం సిరీస్‌ను 0-2తో టీమిండియా చేజార్చుకుంది. చివరి టెస్టు నామమాత్రంగా నిలిచింది. స్వీయ తప్పిదాలు, సొంత రనౌట్లు, షాట్ల ఎంపికతో పొరపాట్లు టీమిండియా ఓటమికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్కోరు వివరాలు:
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 335
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 307
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: 258
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌: 151

Trending News