Zimbabwe All-Out for 189 in 1st ODI vs India: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు చెలరేగారు. అక్షర్ పటేల్, దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ తలో మూడు వికెట్లు పడగొట్టడంతో జింబాబ్వేతో స్వల్ప స్కోరుకే పరిమితం అయింది. జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులు ఆలౌట్ అయి.. టీమిండియా ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జింబాబ్వే బ్యాటర్లు రెగిస్ చకబ్వా (35), బ్రాడ్ ఇవాన్స్ (33 నాటౌట్), రిచర్డ్ ఎన్‌గర్వావ (34) ఫర్వాలేదనిపించారు.
ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో జింబాబ్వే ముందుగా బ్యాటింగ్ చేసింది. జింబాబ్వేకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్వింగ్ మాస్టర్ దీపక్ చహర్ దెబ్బకు 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తాడివానాశే మరుమని (8), ఇన్నోసెంట్ కైయా (4), వెస్లే మాధవెరె (5) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. సీన్ విలియమ్స్ (1)ను మొహ్మద్ సిరాజ్ వెనక్కి పంపడంతో 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే పీకల్లోతు కష్టాల్లో పడింది.
రెగిస్ చకబ్వా క్రీజులో ఉన్నా.. సికిందర్ రజా (12), రైన్ బర్ల్ (11) నిరాశపరిచారు. ఈ ఇద్దరినీ ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. లూక్ జాన్‌గ్వే (13)న అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో జింబాబ్వే 120 పరుగులు చేయడం కూడా కష్టమే అనిపించింది. అయితే టెయిలండర్‌లు రిచర్డ్ ఎన్‌గర్వావ (34), బ్రాడ్ ఇవాన్స్ (33) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 70 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో జింబాబ్వే 189 రన్స్ చేయగలిగింది. భారత బౌలర్లలో చహర్ 3, ప్రసిధ్ 3, అక్షర్ 3, సిరాజ్ ఒక వికెట్ తీశారు.
Innings Break!
Clinical bowling effort from #TeamIndia as Zimbabwe are all out for 189 in 40.3 overs.
Scorecard - https://t.co/P3fZPWilGM #ZIMvIND pic.twitter.com/UmV6JjFjwT
— BCCI (@BCCI) August 18, 2022
Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ వై1 టీవీపై భారీ తగ్గింపు.. రూ. 15 వేలకే 32 ఇంచ్ టీవీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook