India vs Zimbabwe 1st ODI Toss Updates: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, జింబాబ్వే జట్ల మధ్య తొలి వన్డే ఆరంభం కానుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్న ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బౌలింగ్ చేసేందుకు అనుకూలంగా ఉండటంతో ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు రాహుల్ తెలిపాడు. చాలా మంది యువకులకు అవకాశం వచ్చిందని.. వారు నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయమన్నాడు.
శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. ఇషాన్ కిషన్ మూడో స్థానంలో, కేఎల్ రాహుల్ నాలుగులో బ్యాటింగ్ చేయన్నాడు. ఐపీఎల్ స్టార్స్ దీపక్ హుడా, సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నారు. ఇషాన్ ఉన్నా.. సంజూనే వికెట్ కీపింగ్ చేయనున్నాడు. ఇక గాయాల కారణంగా చాలా కాలం జట్టుకు దూరమైన స్వింగ్ మాస్టర్ దీపక్ చహర్ తుది జట్టులోకి వచ్చాడు.
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12:45 ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ భారతదేశంలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక సోనీలివ్ వెబ్‌సైట్ మరియు యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ వికెట్ పై ఇటీవల బంగ్లాతో జరిగిన మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. ఈరోజు కూడా అదే జరగనుంది. మ్యాచుకు ఎలాంటి వర్ష సూచన లేదు.
తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, సంజూ శాంసన్ (కీపర్), అక్షర్ పటేల్, దీపక్ చహర్, కుల్‌దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, మొహ్మద్ సిరాజ్.
జింబాబ్వే: తాడివానాశే మరుమని, ఇన్నోసెంట్ కైయా, సీన్ విలియమ్స్, వెస్లే మాధవెరె, రెగిస్ చకబ్వా (కెప్టెన్), రైన్ బర్ల్, లూక్ జాన్‌గ్వే, బ్రాడ్ ఇవాన్స్, విక్టర్ నైచి, రిచర్డ్ ఎన్‌గర్వావ.
Also Read: Viral Video: రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ప్రేమను ఒప్పుకోలేదని నడి రోడ్డుపైనే యువతిపై కాల్పులు!
Also Read: ఆసక్తి రేకెత్తిస్తున్న ఘరానా మొగుడు స్పెషల్ ట్రైలర్.. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.