Rohit Sharma Debut: 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ పూర్తి.. ఎమోషనల్‌ అయిన రోహిత్‌ శర్మ!

Rohit Sharma completes 15 years in international cricket Today. టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటితో సరిగ్గా 15 ఏళ్లు నిండాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 23, 2022, 07:26 PM IST
  • 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ పూర్తి
  • ఎమోషనల్‌ అయిన రోహిత్‌ శర్మ
  • వ‌న్డేల్లో మూడు సార్లు డ‌బుల్ సెంచ‌రీలు
Rohit Sharma Debut: 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ పూర్తి.. ఎమోషనల్‌ అయిన రోహిత్‌ శర్మ!

Rohit Sharma completes 15 years in international cricket Today: టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటితో సరిగ్గా 15 ఏళ్లు నిండాయి. 2007 జూన్‌ 23న ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్‌ అరంగేట్రం చేశాడు. ఈ 15 ఏళ్లలో రోహిత్ ఎన్నో మైలురాళ్లు, రికార్డులు అందుకున్నాడు. తన ఆటతో ఎంతో మంది క్రికెట్ అభిమానులను అలరించాడు. 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ పూర్తి చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. హిట్‌మ్యాన్‌ ఎమోషనల్‌ అయ్యాడు. 

'అందరికీ నమస్కారం. నాకు ఇష్టమైన భారత జెర్సీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నా. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు పూర్తిచేసుకున్నా. ఇది అద్భుతమైన ప్రయాణం. క్రికెట్‌ ఆటని నా జీవితాంతం ఆదరిస్తాను. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను ఈ స్థాయిలో ఉండటానికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. క్రికెట్ ప్రేమికులు, అభిమానులలే కాకుండా విమర్శకులందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం భారత క్రికెటర్ల పట్ల మీరు చూపుతున్న ప్రేమాభిమనాలు మన జట్టును ఈ స్థాయిలో ఉంచాయి' అని రోహిత్‌ శర్మ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన లేఖలో పేర్కొన్నాడు.

2007లో బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇంట‌ర్నేష‌న్ కెరీర్ ప్రారంభ‌మైంది. ఆరంభంలో మిడిల్ ఆర్డ‌ర్‌లో ఆడిన రోహిత్.. ఆ త‌ర్వాత ఎంఎస్ ధోనీ కారణంగా ఓపెన‌ర్ అయ్యాడు. 2013 త‌ర్వాత హిట్‌మ్యాన్‌ కెరీర్ రాకెట్ వేగంతో దూసుకువెళ్లింది. వన్డేల్లో భారీ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరుగా రోహిత్‌ నిలిచాడు. వ‌న్డేల్లో మూడు సార్లు డ‌బుల్ సెంచ‌రీ చేసిన బ్యాట‌ర్‌గా అతడు రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) రోహిత్‌ పేరిటే ఉంది.

విరాట్ కోహ్లీ నుంచి టీ20 జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ.. కొద్ది కాలంలోనే అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందాడు. ప్రస్తుతం రోహిత్‌ నాయకత్వంలో భారత్ ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉంది. రోహిత్ 45 టెస్టుల్లో 46.13 స‌గ‌టుతో 3137 ర‌న్స్ చేశాడు. ఇందులో 8 సెంచ‌రీలు, 14 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. 230 వ‌న్డేలు ఆడి 48.60 స‌గ‌టుతో 9283 ర‌న్స్ చేశాడు. వన్డేల్లో 29 సెంచ‌రీలు, 44 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక 125  టీ20లలో 3313 ర‌న్స్ చేశాడు. ఇందులో సెంచ‌రీలు, 26 హాఫ్ సెంచ‌రీలు బాదాడు రోహిత్.

Also Read: Train Passenger Video: రైలు బోగీలపై వేలాది మంది ప్రయాణికులు.. వీడియో చూస్తే షాక్ అవ్వడం పక్కా!

Also Read: Green Fennel Benefits: పచ్చి సోంపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.. అవేంటో తెలిస్తే షాక్ అవుతారు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x