MS Dhoni Record: కెప్టెన్‌గా అరుదైన రికార్డు సాధించిన ఎంఎస్ ధోని

MS Dhoni Record: చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్, ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. కేకేఆర్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ధోనీ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ధోనీ సాధించిన ఆ రికార్డు వివరాలు పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 16, 2021, 08:49 AM IST
  • కేకేఆర్ జట్టుతో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ద్వారా అరుదైన రికార్డు సాధించిన ఎంఎస్ ధోని
  • కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లకు ధోనీ నాయకత్వం, 3 వందల మ్యాచ్‌లకు కెప్టెన్‌గా రికార్డు
  • ఐపీఎల్ కెప్టెన్‌గా ఎక్కువ మ్యాచ్‌లు గెలిపించిన రికార్డు కూడా ధోనీకే సొంతం
MS Dhoni Record: కెప్టెన్‌గా అరుదైన రికార్డు సాధించిన ఎంఎస్ ధోని

MS Dhoni Record: చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్, ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. కేకేఆర్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ధోనీ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ధోనీ సాధించిన ఆ రికార్డు వివరాలు పరిశీలిద్దాం.

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ సారధ్యుడిగా ఉన్న ఎంఎస్ ధోని(MS Dhoni)అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ 2021 ఫైనల్(IPL 2021 Final) మ్యాచ్‌తో మొత్తం 3 వందల మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనత దక్కించుకున్నాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ రికార్డు తన పేరిట రాసుకున్నాడు. అంతేకాకుండా ధోనీ సారధ్యంలో నాలుగుసార్లు టైటిల్ సాధించడం కూడా ఓ రికార్డుగా ఉంది. 2010, 2011, 2018లోనూ తరువాత ఇప్పుడు 2021లోనూ ఐపీఎల్ టీ20 టైటిల్‌ను ధోనీ సారధ్యంలోని చైన్నై సూపర్‌కింగ్స్(Chennai Superkings)గెల్చుకుంది. మరోవైపు 9 సార్లు తన జట్టును ఫైనల్ వరకూ చేర్చాడు. 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్‌ను సైతం ఫైనల్‌కు చేర్చాడు. 

ఇక టీ20 కెప్టెన్‌గా అత్యధిక విజయాలు అందుకున్నది కూడా ధోనీనే. ఐపీఎల్‌లో(IPL) 213 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ధోని 130 విజయాలు అందుకున్నాడు. ధోని తరువాత స్థానంలో రోహిత్ శర్మ 75 విజయాలతో ఉన్నాడు. ధోనీ తరువాత అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనత140 మ్యాచ్‌లతో విరాట్ కోహ్లి(Virat Kohli) ఉన్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ధోనీ ఆడతాడా లేదా అనేది ఇంకా తెలియదు. అయితే ఎల్లో డ్రెస్‌లోనే కన్పిస్తానని మాత్రం క్లారిటీ ఇచ్చాడు. అంటే సీఎస్‌కే (CSK)జట్టు తరపునే ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. అది కెప్టెన్‌గానా లేదా ఇతర స్థానంలోనా అనేది వెల్లడించలేదు. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌కు ధోనీ టీమ్ ఇండియా మెంటార్‌గా ఎంపికయ్యాడు.

Also read: IPL 2021 Title Winning Movements: నెట్టింట వైరల్ అవుతున్న సీఎస్‌కే జట్టు విన్నింగ్ మూమెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News