Msk Team For T20 World Cup: ఆసియా కప్ కంటే ముందే విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలన్నారు బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్ కే ప్రసాద్. అలా అయితే కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పరుగులు సాధిస్తాడని చెప్పాడు.
బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కు సంబంధించి భారత బ్యాటింగ్ ఆర్డర్ పై తన మనసులో మాట బయటపెట్టాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ నెలలో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఎంపిక లాంఛనమే అన్నారు. అయితే వారితో పాటు ఐపీఎల్ లో పరుగులు సాధిస్తున్న లెఫ్ట్ హ్యాండర్ శిఖర్ ధావన్ ను కూడా ఎంపిక చేయాలని సూచించాడు.
ఐపీఎల్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆశించనమేర ఆడటం లేదు. అయినప్పటికీ వీరికి మాత్రం టీట్వంటీ వరల్డ్ కప్ జట్టులో చోటు ఉంటుందన్నారు. అయితే ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్న శిఖర్ ధావన్ ను కూడా ఆ టూర్ కు ఎంపిక చేసి ఓపెనింగ్ చేయించాలంటున్నాడు ఎంఎస్‌కే ప్రసాద్. ధావన్ ను ఎంపికచేయకపోవడానికి ఎలాంటి కారణం లేదన్నాడు.
ధావన్ ను ఓపెనింగ్ కు పంపిస్తే.. కేఎల్ రాహుల్ నెంబర్ 4 స్థానంలో ఆడుతాడని ఎంఎస్‌కే చెప్పాడు. గతంలో మాంచెస్టర్ వేదికగా జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో రాహుల్ మిడిల్ ఆర్డర్ లో వచ్చి సెంచరీ చేశాడని గుర్తుచేశాడు. ఇప్పుడు కూడా రాహుల్ ను మిడిల్ ఆర్డర్ కు ఆడించాలన్నాడు.
ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నాడని ఎంఎస్‌కే ప్రసాద్ చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడని గుర్తుచేశాడు. చెన్నై తో జరిగిన మ్యాచ్ లో బంతులు(33) ఎక్కువగా ఆడి తక్కువ(30) పరుగులు చేశాడన్నారు. కోహ్లీ ఆటతీరులో ఎంతో మార్పు వచ్చిందన్నారు. అందుకే అతనికి రవిశాస్త్రి చెప్పినట్టు విశ్రాంతి ఇవ్వాలని సూచించాడు. ఆగస్టులో జరిగే ఆసియా కప్ కంటే ముందే కోహ్లీకి విశ్రాంతి ఇస్తే టీట్వంటీ వరల్డ్ కప్ వరకు పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Also Read: Realme Narzo 50 Offer: రూ.16 వేల విలువైన Realme మొబైల్ ను రూ.669 ధరకే కొనండి!
Also Read: Viral Video: కరోనా టెస్టును నిరాకరించిన మహిళ.. నేలపై పడుకోబెట్టి మరీ చేశారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook