SRH vs RCB: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎవరిది పైచేయి

SRH vs RCB: ఐపీఎల్ 2022 అప్పుడే దాదాపు సగం మ్యాచ్‌లు ముగిశాయి. ఇవాళ జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. ఫామ్‌లో ఉన్న రెండు జట్ల మ్యాచ్ కావడంతో రసవత్తరం కానుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 23, 2022, 10:15 AM IST
  • ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ కీలక మ్యాచ్ నేడే
  • ఫామ్‌లో ఉన్న జట్లు కావడంతో అందరి దృష్టీ ఈ మ్యాచ్‌పైనే
  • ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్‌లో ఎవరిది ఆధిక్యం
 SRH vs RCB: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎవరిది పైచేయి

SRH vs RCB: ఐపీఎల్ 2022 అప్పుడే దాదాపు సగం మ్యాచ్‌లు ముగిశాయి. ఇవాళ జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. ఫామ్‌లో ఉన్న రెండు జట్ల మ్యాచ్ కావడంతో రసవత్తరం కానుంది.

ఐపీఎల్ 2022లో ఇవాళ్టి మ్యాచ్ అందరి దృష్టినీ ఆకర్షించనుంది. హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అనేది అంచనా వేయడం కష్టమే. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా..ఆ తరువాత వరుసగా 4 మ్యాచ్‌లలో విజయం సాధించి ప్రత్యర్ధులకు సవాలు విసురుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇప్పటి వరకూ 6 మ్యాచ్‌లు ఆడి నాలుగింట విజయంతో 8 పాయింట్లతో టాప్ 5లో ఉంది. ఇక 7 మ్యాచ్‌లు ఆడి ఐదింట విజయంతో 10 పాయింట్లు చేజిక్కించుకుని టాప్ 3లో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. విశేషమేమంటే రెండు జట్లూ మంచి ఫామ్‌లో ఉన్నాయి. ముంబై వేదికగా ఇవాళ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ పరంగా రెండు జట్లు బలంగా ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టైతే సమిష్టిగా రాణిస్తోంది. బౌలింగ్ పరంగా ఉమ్రాన్ మాలిక్ నిప్పులు కురిపిస్తుంటే..భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మార్కో జాన్సెన్‌లో పటిష్టంగా ఉంది. గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరమైన వాషింగ్టన్ సుందర్ తిరిగి ఇవాళ ఆడనున్నాడు. బ్యాటింగ్ విషయంలో కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, అభిషేక్ వర్మ, రాహుల్ త్రిపాఠి, మర్కరమ్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో అభిమానుల ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ రాణించలేకపోతున్నాడు. రావత్ ఇంకా నిలదొక్కుకోలేదు. మొన్నటి వరకూ ఫామ్‌లోలేని కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తిరిగి ఫామ్‌లో రావడం ఆ జట్టుకు ప్లస్. గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రం రాణిస్తున్నాడు. దినేష్ కార్తీక్ అద్భుత ప్రదర్శన జట్టుకు లాభం చేకూర్చనుంది. బౌలింగ్ పరంగా మొహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, హసరంగా, హేజిల్ వుడ్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. 

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ 19 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆర్సీబీ 8 సార్లు విజయం సాధించగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 11 సార్లు గెలిచింది. రెండు బలమైన జట్ల మధ్య మ్యాచ్ కావడంతో అందరికీ ఆసక్తి నెలకొంది.

Also read: DC Vs RR: 'నో బాల్' కోసం పంత్ 'పంతం'.. చివరి ఓవర్‌లో హైడ్రామా... గల్లీ క్రికెట్‌ను తలపించిన ఐపీఎల్ మ్యాచ్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News