Mayank Agarwal Injury: క్రీజ్‌లోనే కుప్పకూలిన మయాంక్ అగర్వాల్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం!

SRH vs PBKS, IPL 2022, Mayank Agarwal Injury. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతికి పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ గాయపడ్డాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 12:18 PM IST
  • ఉమ్రాన్ మాలిక్ అత్యంత వేగవంతమైన డెలివరీ
  • క్రీజ్‌లోనే కుప్పకూలిన మయాంక్ అగర్వాల్
  • త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
Mayank Agarwal Injury: క్రీజ్‌లోనే కుప్పకూలిన మయాంక్ అగర్వాల్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం!

Sunrisers Hyderabad pacer Umran Malik bouncer hits Punjab Kings captain Mayank Agarwal ribs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్‌లను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. లీగ్ ఆసాంతం వేగవంతమైన డెలివరీలు వేశాడు. స్థిరంగా 150 కిమీ వేగంతో బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సన్‌రైజర్స్ ఆడిన అన్ని మ్యాచులలో ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు ఉమ్రాన్ మాలిక్‌కే దక్కిందంటే.. అతడి వేగం ఎంతుంటుందో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి బంతులకు బ్యాటర్‌లు తరచుగా గాయపడుతుంటారు. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన లీగ్ చివరి మ్యాచులో ఇదే జరిగింది. 

ఐపీఎల్ 2022 లీగ్ చివరి మ్యాచ్‌ వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని చేధించేందుకు పంజాబ్ బరిలోకి దిగింది. జానీ బెయిర్‌స్టో (23), షారుఖ్ ఖాన్ (19) ఔట్ అయిన అనంతరం పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ క్రీజులోకి వచ్చాడు. ఏడవ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌కు దిగాడు. ఆ ఓవర్లోని నాలుగో బంతిని ఉమ్రాన్ షార్ట్ డెలివరీగా వేయగా.. మయాంక్ బంతి వేగాన్ని అంచనా వేయలేకపోయాడు. దాంతో బ్యాట్ కనెక్ట్ కానీ బంతి నేరుగా వచ్చి మయాంక్ పక్కటెముకలను తాకింది. 

పక్కటెముకలకి తాకిన బంతి దూరంగా వెళ్లడంతో.. మయాంక్ అగర్వాల్ రన్ కోసం పరిగెత్తాడు. పరుగెత్తుతున్నప్పుడు అతడు తన పక్కటెముకల మీద ఒక చేతిని పెట్టుకుని రన్ తీశాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకోగానే నేలపై పడిపోయి నొప్పితో విలవిలలాడిపోయాడు. దీంతో జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. ఆ సమయంలో కూడా పంజాబ్ కెప్టెన్ నొప్పితో అల్లాడిపోయాడు. అతడి తాకిన బంతి 143 కిమీ వేగంతో దూసుకొచ్చింది. 

చికిత్స అనంతరం మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే ఎక్కువ సేపు మాత్రం క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 బంతుల్లో 1 రన్ తీసి ఔట్ అయ్యాడు. ఈ సీజన్లో మయాంక్ అగర్వాల్ పేలవ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ సీజన్‌ను ఘనంగా ముగించింది. ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలతో 14 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. 

Also Read: Kane Williamson: రెండోసారి తండ్రైన కేన్ విలియమ్సన్.. లిటిల్ మ్యాన్‌కు స్వాగతం అంటూ!

Also Read: Monday Remedy Tips: సోమవారం ఈ పూజలు చేస్తే.. జీవితంలో డబ్బు సమస్యలు ఎప్పటికీ రావు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News