Monday Remedy Tips: సోమవారం ఈ పూజలు చేస్తే.. జీవితంలో డబ్బు సమస్యలు ఎప్పటికీ రావు!

Monday Remedy, Lord Shiva Worship on Monday. సోమవారం నాడు శివుడిని భక్తి శ్రద్దలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 10:13 AM IST
  • సోమవారం ఈ పూజలు చేస్తే
  • జీవితంలో డబ్బు సమస్యలు ఎప్పటికీ రావు
  • మీకు కాసుల వర్షమే
Monday Remedy Tips: సోమవారం ఈ పూజలు చేస్తే.. జీవితంలో డబ్బు సమస్యలు ఎప్పటికీ రావు!

Monday Remedy Tips: తన కుటుంబం సంతోషంగా ఉండడానికి ఈ భూ ప్రపంచంలోని ప్రతిఒక్కరు ఎంతో కష్టపడి డబ్బును సంపాదిస్తారు. కుటుంబం కోసం రేయింబవళ్లు కష్టపడతారు. కొన్ని సార్లు అవిశ్రాంతంగా పనిచేసినప్పటికీ.. కొందరు డబ్బు సంబంధిత సమస్యలను అధిగమించలేరు. ఇందుకు కారణం తమ గ్రహ బలం అని నమ్ముతారు కొందరు. హిందూ మతంలో వారంలోని ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత ఉంటుందన్నా విషయం తెలిసిందే. సోమవారం భోలేనాథ్‌కు అంకితం చేయబడింది. 

శ్రేయస్సు కోసం: 
సోమవారం నాడు ఈ పూజలు చేస్తే జీవితంలో డబ్బు సమస్యలు ఎప్పటికీ రావని భోపాల్ నివాసి అయిన పండిట్ హితేంద్ర కుమార్ శర్మ చెప్పారు. సోమవారం భోలేనాథ్‌కు అంకితం చేయబడింది. సోమవారం నాడు శివుడిని భక్తి శ్రద్దలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. క్రమం తప్పకుండా శివుడిని పూజించడం ద్వారా భోలేనాథ్ తన భక్తులకు ఆనందం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తాడట. 

డబ్బు సమస్యల కోసం:
అవిశ్రాంతంగా పనిచేసినప్పటికీ కొందరు డబ్బు సంబంధిత సమస్యలను అధిగమించలేరు. అలాంటి వారు సోమవారం రాత్రి శివ లింగంపై నెయ్యి దీపం వెలిగించాలి. ఆ దీపం 41 రోజులు పాటు వెలుగుతూనే ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల శివుని ప్రత్యేక అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. 

ఉద్యోగం కోసం:
శివుడిని భోలేనాథ్ అని కూడా అంటారన్న విషయం తెలిసిందే. ఒక వ్యక్తి తన పని విజయవంతం కావాలని భోలేనాథ్‌ను హృదయపూర్వకంగా ప్రార్ధించాలి. అంతేకాదు శివ లింగానికి బెల్ ఆకులు, దాతురా, పాలు మరియు నీటితో అభిషేకం చేస్తే భోలేనాథ్ సంతోషిస్తాడు. అప్పుడు మీరు అనుకున్న పనిలో విజయం దక్కుతుంది.

వ్యాపారం కోసం:
సోమవారం నాడు ఉదయాన్నే తలంటు స్నానం చేసి శివుని గుడికి వెళ్లాలి. శివుడికి, శివ లింగంకు తేనెను సమర్పిస్తే.. ఉద్యోగం లేదా వ్యాపారంలో వచ్చే అడ్డంకులను తొలగిపోతాయి. మీమీ రంగాల్లో పురోగతిని అనుగ్రహిస్తాడు.

పితృత్వం కోసం:
కొంతమంది జాతకంలో పితృ దోషం రావడం వల్ల వారి పురోగతి ఆగిపోతుంది లేదా వ్యాపారంలో లాభం పొందలేరు. అటువంటి వారు సోమవారం అక్షత మరియు నల్ల నువ్వులను అవసరమైన వ్యక్తికి దానం చేయండి. ఇలా చేయడం ద్వారా పితృ దోషం నుంచి బయటపడతారు. దాంతో పురోగతికి మార్గం సులువవుతుంది.

Also Read: Shukra Gochar 2022: నేటి నుంచి 27 రోజుల పాటు.. ఈ ఐదు రాశుల వారికి డబ్బే డబ్బు!

Also Read: Gold Price Today: పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News