కొచ్చి వేదికగా రేపు అంటే డిసెంబర్ 23న మినీ వేలం జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం పది ఫ్రాంచైజీల కోసం 403 మంది ఆటగాళ్లు వేలానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఎంత ధర పలకవచ్చనే విషయంపై భారీగానే అంచనాలున్నాయి.
ఇప్పటి వరకూ వివిధ ఐపీఎల్ టోర్నీల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఉన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 16.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో రెండవ ఖరీదైన ఆటగాడిగా యువరాజ్ సింగ్ ఉన్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ 2015లో 16 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇక పాట్ కమిన్స్ అత్యంత ఖరీదైన ఐపీఎల్ ఆటగాళ్లలో మూడవ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 15.5 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో ఖరీదైన విదేశీ ఆటగాడు ఇతనే కావడం విశేషం. ఇక టీమ్ ఇండియా ఆటగాడు ఇషాన్ కిషన్ ఐపీఎల్ చరిత్రలో నాలుగవ అత్యంత ఖరీదైన ఆటగాడు. ఐపీఎల్ 2022 మెగావేలంలో ముంబై ఇండియన్స్ 15.25 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇక ఐపీఎల్ చరిత్రలో ఐదవ అత్యంత ఖరీదైన ఆటగాడు న్యూజిలాండ్‌కు చెందిన కైల్ జేమీసన్. ఐపీఎల్ 2021 వేలంలో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీలు పోటీపడ్డాయి. చివరికి ఆర్సీబీ ఇతడిని 15 కోట్లకు దక్కించుకుంది.
Also read: IPL 2023: మరి కొద్దిగంటల్లో ఐపీఎల్ మినీ వేలం, కెప్టెన్సీ అవకాశాలున్న ముగ్గురు ప్లేయర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook