IPL 2023 Retention: ఐపీఎల్ 2023 రిటెన్షన్ జాబితా ఇవాళే విడుదల, వేలం ఎప్పుడంటే

IPL 2023 Retention: టీ20 ప్రపంచకప్ 2022 ముగిసింది. ఇప్పుడు అందరూ ఐపీఎల్ల 2023 పై దృష్టి సారించారు. ఐపీఎల్ 2023 కోసం వివిధ జట్ల రిటెన్షన్ డే ఇవాళ అంటే నవంబర్ 15న జరగనుంది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 15, 2022, 01:21 AM IST
IPL 2023 Retention: ఐపీఎల్ 2023 రిటెన్షన్ జాబితా ఇవాళే విడుదల, వేలం ఎప్పుడంటే

ఐపీఎల్ 2023 సన్నాహాలు అప్పుడే ప్రారంభమైపోయాయి. టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 10 ఐపీఎల్ జట్ల రిటెన్షన్ జాబితా ఇవాళ అంటే నవంబర్ 15లోగా ప్రకటించాల్సి ఉంది. అంటే వేలంలో ఎవరుంటారు, ఎవరిని జట్లు ఉంచుకుంటుందనేది ఇవాళ తేలిపోనుంది.

ఐపీఎల్ 2023 కోసం కీలకమైన ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. ఐపీఎల్ 2023 వేలానికి ముందు రిటెన్షన్ ప్రక్రియ కీలకం. అంటే మొత్తం 10 ఫ్రాంచైజీ జట్లు తమతో ఉన్న ఆటగాళ్లలో ఎవరిని రిటెన్షన్ చేసుకుంటుంది అంటే ఎవరిని ఉంచుకుంటుందనేది ఓ జాబితా విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ జాబితాలో ఉన్నవాళ్లు తప్పించి మిగిలినవాళ్లంతా తిరిగి వేలంలో వచ్చేస్తారు. 

ఈ రిటెన్షన్ జాబితాను దేశంలోని 10 ఐపీఎల్ జట్లు ఇవాళ్టిలోగా ప్రకటించాల్సి ఉంది. ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం డిసెంబర్ 23వ తేదీన కొచ్చిలో జరగవచ్చు. దీనికంటే ముందు ఇవాళ రిటైన్ జాబితా, రిలీజ్ జాబితా రెండూ అందించాలని బీసీసీఐ 10 ఫ్రాంచైజీలను కోరింది. మరోవైపు ఐపీఎల్ 2023 ట్రేడ్ విండో కూడా ఇవాళ ముగియనుంది. 

ఓ నివేదిక అందించిన వివరాల ప్రకారం మినీ వేలంలో ప్రతి జట్టుకు అదనంగా 5 కోట్లు లభించనున్నాయి. అంటే ఐపీఎల్ 2023 మినీవేలంలో ఫ్రాంచైజీల విలువ మొత్తం 95 కోట్లకు పెరగనుంది. ఐపీఎల్ రిటెన్షన్ షో అధికారిక సమయం ఇంకా వెల్లడికాలేదు.ఈ షోను స్టార్‌స్పోర్ట్స్ ప్రసారం చేయనుంది. ఇవాళ 10 ఫ్రాంచైజీ జట్లు రిలీజ్ చేసే ఆటగాళ్లు కొచ్చిలో డిసెంబర్ 23న జరిగే మినీ వేలంలో పాల్గొంటారు. 

Also read: Shardul Thakur: శార్థూల్ ఠాకూర్‌ను అమ్మేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. కారణం ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News