Mitchell Starc: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర 20.50 కోట్లకు ప్యాట్ కమిన్స్‌ను చేజిక్కించుకుని సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం రేపగా, కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో ఆస్ట్రేలియన్ పేసర్‌ను అంతకంటే భారీ ధర ఇచ్చి పొందింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ నిలిచాడు.
ఐపీఎల్ 2024లో ఊహించిందే జరుగుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన వన్డే ప్రపంచకప్ హీరోలు భారీ ధర పలుకుతున్నారు. ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ హీరోలు ముగ్గురున్నారు. ఒకరు ట్రేవిస్ హెడ్. చెన్నై సూపర్‌కింగ్స్‌తో పోటీ పడి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతడిని 6.80 కోట్లకు చేజిక్కించుకుంది. ఆ తరువాత ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా రధ సారధి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య పోటీ నువ్వా నేనా రీతిలోసాగింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర 20.50 కోట్లకు ఎస్ఆర్‌హెచ్ జట్టు సొంతం చేసుకుంది. ప్యాట్ కమిన్స్ మాత్రమే అత్యధిక ధరకు విక్రయమైన ఆటగాడని భావిస్తున్న తరుణంలో ఐపీఎల్ వేలంలో మరో అద్భుతం చోటుచేసుకుంది.
ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలో దిగగానే ఫ్రాంచైజీలు విపరీతంగా పోటీ పడ్డాయి. మొదట్లో ఇతని కోసం ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ పోటీ పడ్డాయి. కానీ చివరి వరకూ పోటీలో నిలిచింది గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య హోరాహోరీగా సాగింది. 10 కోట్లు దాటింది. 15 కోట్లు దాటింది. 20 కోట్లు దాటేసింది. అయినా ఈ రెండు జట్లు ఎక్కడా తగ్గలేదు. గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ఇతడిపై చాలా ఆసక్తి చూపించాయి. అందుకే రెండు జట్ల మధ్య భారీగా పోటీ సాగింది. చివరికి గుజరాత్ టైటాన్స్ జట్టుతో పోటీ పడిన కేకేఆర్ జట్టు 24.75 కోట్లకు చేజిక్కించుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook