IPL Eliminator Match: ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు లక్నో ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. లక్నో బ్యాట్స్‌మ్యాన్ రజత్ పటీదార్ చెలరేగి ఆడి అజేయ సెంచరీ సాధించాడు. వన్ డౌన్‌లో వచ్చిన రజత్ 7 సిక్సులు, 12 ఫోర్లతో కేవలం 54 బంతుల్లోనే 112 పరుగులు చేశాడు. రజత్ సెంచరీ ఇన్నింగ్స్‌తో బెంగళూరు భారీ స్కోర్ చేయగలిగింది. దినేశ్ కార్తీక్ 37 పరుగులతో రాణించాడు.
Rajat Patidar’s brilliant century and DK’s clutch innings at the end, help us put up a massive total. 👊🏻🙌🏻
It’s your time to shine, bowlers! 💪🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #LSGvRCB #PlayOffs pic.twitter.com/tGSv3nyZ4W
— Royal Challengers Bangalore (@RCBTweets) May 25, 2022
ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బెంగళూరును బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. తొలి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ డుప్లెసిస్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లి-రజత్ పటీదార్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ (9), లోమ్రోర్ (14) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. రజత్ పటీదార్ తన దూకుడు కొనసాగించాడు. చివరలో దినేశ్ కార్తీక్ రజత్‌కు చక్కని సహకారం అందించాడు.
తాజా ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచే జట్టు క్వాలిఫయర్-2లో రాజస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలుపొందే జట్టు ఫైనల్ చేరుతుంది. ఆడిన తొలి సీజన్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. లక్నోకి కూడా ఇదే తొలి ఐపీఎల్ సీజన్. ఈ మ్యాచ్‌లో లక్నో బెంగళూరును ఓడిస్తుందా లేక చతికిలపడుతుందా చూడాలి.
Also Read: Athmakur By Election 2022: ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ...
Also Read: Venu Rahu Combination: రాహువు, శుక్ర కలయిక జాతకంలో బలంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి