IPL Updates Lucknow Beats Kolkata: ఐపీఎల్లో లీగ్ మ్యాచ్‌లు చివరి అంకానికి చేరుకున్న దశలో.. జట్ల మధ్య థ్రిల్లింగ్ ఫైట్స్ క్రికెట్ ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్-ముంబై జట్లు హోరాహోరీ తలపడగా... ఇవాళ (మే 18) కోల్‌కతా-లక్నో జట్లు అంతకన్నా హోరాహోరీగా తలపడ్డాయి. లక్నో తరుపున డికాక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా... కోల్‌కతా తరుపున రింకు సింగ్ చివరలో మెరుపులు మెరిపించాడు. మలుపులు తిరుగుతూ సాగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో చివరకు లక్నోనే విజయం వరించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ 10 సిక్సులు, 10 ఫోర్లతో 70 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. ఇందులో చివరి రెండు ఓవర్లలోనే డికాక్ 3 సిక్సులు, 4 ఫోర్లు బాదడం విశేషం. మరో ఎండ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ 4 సిక్సులు 3 ఫోర్లతో 68 పరుగులతో డికాక్‌కి చక్కటి సహకారం అందించాడు. క్రీజులో ఈ ఇద్దరూ చెలరేగుతుంటే కోల్‌కతా బౌలర్లు నిశ్చేష్ఠులైపోయారు. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌథీ, రసెల్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
డికాక్-రాహుల్ అద్భుత ఇన్నింగ్స్‌తో లక్నో 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. 211 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన కోల్‌కతాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ డకౌట్ అవగా, మరో ఓపెనర్ అభిజిత్ తోమర్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో నితీశ్ రానాతో కలిసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 65 పరుగుల వద్ద నితీశ్ రానా (42), 131 పరుగుల వద్ద శ్రేయస్ అయ్యర్ (50) ఔట్ అవడంతో కోల్‌కతాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.
చివరి 3 ఓవర్లలో రింకు సింగ్ మెరుపులు మెరిపించడంతో కోల్‌కతా జట్టులో మళ్లీ ఆశలు చిగురించాయి. స్టొయినిస్ వేసిన 19వ ఓవర్లో 6 బంతుల్లో 21 పరుగులు అవసరమైన దశలో రింకు సింగ్ తొలి బంతిని ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు వరుస సిక్సర్లు బాదాడు. ఇక చివరి 3 బంతుల్లో 5 పరుగులు అవసరం కాగా... నాలుగో బంతికి రింకు రెండు పరుగులు తీశాడు. దీంతో చివరి రెండు బంతుల్లో కోల్‌కతా విజయానికి 3 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో ఐదో బంతికి రింకు సింగ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా... క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ స్టొయినిస్ వేసిన బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో కోల్‌కతా రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో లక్నో ప్లేఆఫ్స్‌కి చేరగా కోల్‌కతా ఇంటి ముఖం పట్టింది.
Aisa josh jisne uda diye hosh! Super proud of our #SuperGiants on this zabardast jeet 🫶🏽👊 #abapnibaarihai💪#AbApniBaariHai💪 #IPL2022 🏆 #bhaukaalmachadenge #LSG #LucknowSuperGiants #T20 #TataIPL #Lucknow #UttarPradesh #lsg2022 pic.twitter.com/hfOfpuxCjZ
— Lucknow Super Giants (@LucknowIPL) May 18, 2022
Also Read: Spiritual Importance of Thursday: గురువారం వివాహిత స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయకూడదు...
Also Read: TRS Rajyasabha Seats: రాజ్యసభ సీట్లను కేసీఆర్ బేరం పెట్టారా? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook