Arjun Tendulkar: అర్జున్‌ టెండూల్కర్‌కు లక్కీ ఛాన్స్‌.. ముంబై తుది జట్టులో చోటు! స్టార్ ప్లేయర్ స్థానంలో బరిలోకి

Arjun Tendulkar to replace India Star Jasprit Bumrah in IPL 2023. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌కు వరం కానుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 29, 2023, 03:43 PM IST
  • అర్జున్‌ టెండూల్కర్‌కు లక్కీ ఛాన్స్‌
  • ముంబై తుది జట్టులో చోటు
  • స్టార్ ప్లేయర్ స్థానంలో బరిలోకి
Arjun Tendulkar: అర్జున్‌ టెండూల్కర్‌కు లక్కీ ఛాన్స్‌.. ముంబై తుది జట్టులో చోటు! స్టార్ ప్లేయర్ స్థానంలో బరిలోకి

Arjun Tendulkar to play IPL 2023 in place of Jasprit Bumrah: మరో రెండు రోజులలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌కు తెర లేవనుంది. అయితే గాయాల కారణంగా ఐపీఎల్ 2023కి దూరమయిన ఆటగాళ్ల జాబితా ఈసారి పెద్దగానే ఉంది. దాంతో యువ ఆటగాళ్లకు నిరూపించుకునేందుకు మంచి అవకాశం దక్కనుంది.  ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌కు ఐపీఎల్ టోర్నీలో ఆడే ఆవకాశం రానుంది. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం.. అర్జున్‌ టెండూల్కర్‌కు వరం కానుంది. 

క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ టోర్నీలో ఐదు టైటిళ్లను గెలుచుకున్న ముంబై ఇండియన్స్.. గత 2-3 సీజన్లుగా ప్లే ఆఫ్స్ కూడా చేరడం లేదు. ఈసారి కూడా జట్టుకు ఓటములు తప్పేలా లేవు. బ్యాటింగ్ విషయం పక్కనపెడితే.. బౌలింగ్‌ విభాగం చాలా బలహీనంగా ఉంది. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ సీజన్‌ మొత్తంకు దూరంగా ఉండనున్నారు. దీంతో మంచి ఆల్‌రౌండర్‌ అయిన  అర్జున్ టెండూల్కర్ ఈ సీజన్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. 2021లో ముంబై ఇండియన్స్‌ జట్టులో చేరిన అర్జున్.. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. 

గాయాల కారణంగా అర్జున్‌ టెండూల్కర్‌కు అవకాశం ఇవ్వడం వల్ల ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగం కూడా బలంగా మారుతుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోందని సమాచారం తెలుస్తోంది. క్యామెరూన్‌ గ్రీన్‌తో కలిసి ఆల్‌రౌండర్‌గా సేవలందించగలడని మేనేజ్మెంట్ భావిస్తోందట. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అర్జున్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయట. జోఫ్రా ఆర్చర్, జాసన్ బెహ్రెండోర్ఫ్ సహా గ్రీన్‌, అర్జున్‌ బౌలింగ్ చేయనున్నారు. ఐపీఎల్ ఆరంభానికల్లా ముంబై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

ముంబైలో పుట్టిన అర్జున్‌ టెండూల్కర్‌.. రంజీ ట్రోఫీలో గోవా తరఫున ఆడుతున్నాడు. రంజీ మ్యాచులలో అర్జున్ మంచి ప్రదర్శన చేశాడు. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది సత్తాచాటాడు. ఇప్పటివరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్జున్‌.. 547 పరుగులు చేశాడు. మరోవైపు 12 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక దేశీయ క్రికెట్‌లో 9 టీ20 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు, 180 పరుగులు చేశాడు. 

ముంబై తుది జట్టు (అంచనా):
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, క్యామెరూన్‌ గ్రీన్‌, జోఫ్రా ఆర్చర్, అర్జున్‌ టెండూల్కర్‌, షామ్స్ ములానీ, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండోర్ఫ్. 

Also Read: SRH IPL 2023 Schedule: రాజస్థాన్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్.. పూర్తి షెడ్యూల్ ఇదే! కెప్టెన్, టీమ్ వివరాలు  

Also Read: Surya Gochar 2023: 'యువ స్థితి'లోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారికి డబ్బేడబ్బు! సమాజంలో గౌరవం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

More Stories

Trending News