CSK vs MI IPL 2023 49th Match Playing 11 and Dream11 Team Prediction: ఐపీఎల్ 2023లో మరో డబుల్ బొనాంజాకు సమయం వచ్చేసింది. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెపాక్ వేదికగా జరగనుంది. గత రెండు మ్యాచుల్లో 200కి పైగా టార్గెట్‌ను ఛేదించిన ముంబై మంచి జోరుమీదుంది. అదే సమయంలో చెన్నై కూడా మంచి ఊపులో ఉంది. అయితే ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం కాకుండా ఉండాలంటే.. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఫలితం ఎంతో కీలకం. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. చెన్నై, ముంబై మధ్య బిగ్ ఫైట్ కాబట్టి ఫాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
యువ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఫలితాలను మాత్రం రాబడుతోంది. అయితే గత రెండు మ్యాచుల్లో మాత్రం విఫలం కావడం నిరాశకు గురి చేసింది. డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించడం చెన్నై ఓటమికి కారణంగా చెప్పొచ్చు. పతిరాణ, దేశ్ పాండే వికెట్లు తీస్తున్నప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అయితే బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. అందరూ దూకుడుగానే ఆడేస్తున్నారు. బౌలింగ్ పుంజుకుంటే సరిపోతుంది.
హ్యాట్రిక్ విజయాలతో ముంబై ఇండియన్స్ ఫామ్ మీదుంది. గత రెండు మ్యాచుల్లోనూ 200కిపైగా టార్గెట్‌ను ఛేదించేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోయినా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్ భారీగా పరుగులు చేస్తున్నారు. ముంబై బౌలింగ్ పటిష్ఠంగా లేకపోవడం ప్రతికూలత. సీనియర్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. వెటరన్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా మాత్రం వికెట్లు తీస్తున్నాడు. బ్యాటర్లు చెలరేగితే చెన్నై విజయం పెద్ద కష్టమేమి కాదు.
నేడు చెన్నైలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడే అవకాశాలు లేవట. దాంతో పూర్తిస్థాయి మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు లేకపోవచ్చు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారే ఛాన్స్ ఉంది. టాస్ నెగ్గే జట్టు తొలుత బౌలింగ్‌కే ప్రాధాన్యత ఇవ్వనుంది.
తుది జట్లు (అంచనా):
చెన్నై సూపర్ కింగ్స్: డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానె, శివమ్ దూబె, మొయిన్ అలీ, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, మహీశ్ తీక్షణ, దీపక్ చాహర్, మతీషా పతిరాణ, తుషార్ దేశ్‌పాండే
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధెరా, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూశ్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్.
డ్రీమ్ 11 టీమ్:
కీపర్ - డెవాన్ కాన్వే, ఇషాన్ కిషన్
బ్యాట్స్‌మెన్ - రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్)
ఆల్ రౌండర్లు - రవీంద్ర జడేజా (కెప్టెన్), మొయిన్ అలీ, కామెరాన్ గ్రీన్
బౌలర్లు - పీయూష్ చావ్లా, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, జోఫ్రా ఆర్చర్
Also Read: Team India Head Coach MS Dhoni: టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ.. హింట్ ఇచ్చిన సునీల్ గవాస్కర్!
Also Read: Toyota Hyryder Price Hike 2023: 60 వేలు పెరిగిన టయోటా హైరైడర్ ధర.. కొత్త ధరల జాబితా ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.