DC vs PBKS: టాస్‌ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్.. రజా వచ్చేశాడు! తుది జట్లు ఇవే

Delhi Capitals have won the toss and have opted to field. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడనున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : May 13, 2023, 07:35 PM IST
DC vs PBKS: టాస్‌ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్.. రజా వచ్చేశాడు! తుది జట్లు ఇవే

DC vs PBKS IPL 2023 Live Score Updates: ఐపీఎల్‌ 2023లో డబుల్‌ ధమాకాలో భాగంగా రెండో మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడనున్నాయి. టాస్‌ నెగ్గిన ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని వార్నర్ చెప్పాడు. మరోవైపు ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ చెప్పాడు. రాజపక్సే స్థానంలో రజా తుది జట్టులోకి వచ్చాడు.

ఐపీఎల్‌ 2023లో ఇప్పటివరకు పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు 11 మ్యాచ్‌లు ఆడాయి. అందులో పంజాబ్‌ ఐదు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉండగా.. ఢిల్లీ కేవలం నాలుగింట్లో విజయం సాధించి అట్టడుగు స్థానంలో ఉంది. మధ్యలో రెండు విజయాలతో గాడినపడ్డట్లే కనిపించిన ఢిల్లీ.. మళ్లీ పరాజయాల బాట పట్టింది. మరోవైపు పంజాబ్‌ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయితే ఢిల్లీతో పోలిస్తే పంజాబ్‌ ఫెవరేట్ అని చెప్పొచ్చు. ఇరు జట్లు గతంలో 30 సార్లు తలపడగా చెరో 15 మ్యాచ్‌లు గెలిచాయి.

తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్. 
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (కీపర్), సామ్ కరన్, సికందర్ రజా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్. 

ఇంపాక్ట్ ప్లేయర్స్:
ఢిల్లీ క్యాపిటల్స్: మనీష్ పాండే, రిపాల్ పటేల్, లలిత్ యాదవ్, చేతన్ సకారియా, అభిషేక్ పోరెల్. 
పంజాబ్ కింగ్స్: నాథన్ ఎల్లిస్, అథర్వ టైడే, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, మోహిత్ రాథీ. 

Also Read: Bajaj Avenger 220 Street: రాయల్ ఎన్‌ఫీల్డ్ మాదిరి బైక్‌ను విడుదల చేసిన బజాజ్.. సగం ధరకే అద్భుతమైన ఫీచర్లు!

Also Read: SRH vs LSG: హైదరాబాద్ ఫ్యాన్స్ కారణంగా ఆగిన మ్యాచ్.. వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News