David Warner To Lead Delhi Capitals In IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందు అన్ని జట్లు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా మార్క్‌రమ్ పేరును ప్రకటించగా.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తన కొత్త కెప్టెన్ పేరును వెల్లడించింది. ప్రస్తుత కెప్టెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం కోలుకునే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ యంగ్ క్రికెటర్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త నియామకం అనివార్యమైంది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించగా.. స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ యాజమాన్యం ధృవీకరించింది.
"డేవిడ్ వార్నర్ మా కెప్టెన్‌గా ఉంటాడు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడు." అని వెల్లడించింది. గత సీజన్‌లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నమెంట్‌ను ఐదవ స్థానంలో నిలిచింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. ఏడింటిలో ఓడిపోయింది. పంత్ జట్టుకు దూరమైన నేపథ్యంలో సారి ఢిల్లీ ప్రదర్శన ఎలా ఉంటుందోనని ఆసస్తి నెలకొంది. మరోవైపు డేవిడ్ వార్నర్ చాలా కాలంగా ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. గతంలో కెప్టెన్‌గా సన్ రైజర్స్ హైదరాబాద్‌ను విజయపథంలో నడిపించాడు.
డేవిడ్ వార్నర్ మే 2009లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను మొత్తం 162 మ్యాచ్‌లు ఆడగా.. 42.01 సగటుతో 5,881 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు సాధించాడు. వార్నర్ అత్యధిక స్కోరు 126 పరుగులు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. డేవిడ్ వార్నర్ తన దూకుడు కెప్టెన్సీతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును మొదటిసారి ఛాంపియన్‌గా నిలుపుతాడని అభిమానులు అంటున్నారు. వార్నర్ తన కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఐపీఎల్ 2016 ఛాంపియన్‌గా నిలబెట్టాడు.
Also Read: Pee Gate in Karnataka: బస్సులో నిద్రిస్తున్న మహిళపై మూత్రం పోసిన యువకుడు
Also Read: Umesh Yadav Father: ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి