Mysterious Disease: కరోనా కంటే డేంజర్ వైరస్.. 24 గంటల్లోనే ముక్కు నుంచి రక్తం కారుతూ ముగ్గురు మృతి

New Virus In Africa: ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త వైరస్‌లు పంజా విసురుతున్నాయి. ప్రస్తుతం మళ్లీ కోవిడ్ విజృంభణ మెల్లగా పెరుగుతుండగా.. ఆఫ్రికాలో మరో డేంజర్ వైరస్ పట్టుకొచ్చింది. ఈ వ్యాధి సోకిన వారు 24 గంటల వ్యవధిలోనే ముక్కు నుంచి రక్తం కారుతూ మరణించడం ఆందోళన కలిగిస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2023, 06:16 AM IST
Mysterious Disease: కరోనా కంటే డేంజర్ వైరస్.. 24 గంటల్లోనే ముక్కు నుంచి రక్తం కారుతూ ముగ్గురు మృతి

New Virus In Africa: కరోనా మహమ్మారి తరువాత కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఆఫ్రికా దేశం బురుండిలోని ఓ చిన్న పట్టణంలో కొత్త రకం వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. బజిరో పట్టణంలో గుర్తు తెలియని వైరస్ కారణంగా ముక్కు నుంచి రక్తం కారుతూ కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ కారణంగా 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు మరణించారు. కొత్త రకం వైరస్ బారినపడిన వారిలో జ్వరం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. బురుండి పట్టణంలో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఆసుపత్రిలో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

ఈ నేపథ్యంలో దేశంలోని వైద్య అధికారులు అప్రమత్తయ్యారు. వైరస్‌ను అరికట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రజంతా ఇళ్లలోనే ఉండి క్వారంటైన్ పాటించాలని కోరారు. మిగ్వా ఆరోగ్య కేంద్రంలోని ఓ నర్సు మాట్లాడుతూ.. ఈ వ్యాధి త్వరగా ప్రాణాలు తీస్తోందని చెప్పారు. ఆసుపత్రికి చేరుకునే 24 గంటలలోపే ముగ్గురు రోగులు ముక్కు నుంచి రక్తం కారడంతో మరణించారని వెల్లడించారు. సాధ్యమైనంత తొందరగా.. ఎపిడిమిక్‌గా ప్రకటిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు. 

ఈ నెల ప్రారంభంలోనే బురుండికి పొరుగుదైశమైన టాంజానియా మార్బర్గ్ వైరస్ వ్యాప్తిపై ప్రకటన చేసింది. ఈ వైరస్ లక్షణాలు 8 మందిలో కనిపించగా.. వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి ఇతర దేశాలపై ప్రభావం చూపిస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. కాగా.. కొన్నేళ్ల క్రితం ఎబోలా వైరస్ ఆఫ్రికా దేశంలో మారణ హోమం సృష్టించగా.. తాజాగా కొత్త రకం వైరస్‌లు పుట్టుకోస్తుండడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 

కొత్త రకం వైరస్ కారణంగా మరణించిన ముగ్గురు కూడా గిటోబో కమ్యూనిటీకి చెందిన వారే. వీరు మిగ్వా కొండ ప్రాంతానికి సమీపంలో జీవనం సాగిస్తుంటారు. ఈ వైరస్ బారినపడి ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బాధితుల నుంచి శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. గతేడాది జూలైలో దక్షిణ టాంజానియాలో ముగ్గురు వ్యక్తులు నోస్‌బ్లీడ్ అనే వ్యాధితో మరణించగా.. అక్కడికి వెళ్లి పరిశీలించడానికి వైద్య పరిశోధనా బృందాన్ని పంపారు. ఎబోలా మాదిరిగానే కోవిడ్, మార్బర్గ్, కొత్త రకం వైరస్‌లకు సోకుతున్న వారిని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు దేశంలోని టాప్ మెడికల్ ఆఫీసర్ ఐఫెల్లో సిచల్వే తెలిపారు. 

Also Read: Currency News: ప్రజలకు గుడ్‌న్యూస్.. తెరపైకి మళ్లీ రూ.1000 నోటు   

Also Read: IPL 2023: డామిట్ కథ అడ్డం తిరిగింది.. కోట్ల ధర పలికి చివరికి..!   

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News