RR Vs PBKS: రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ ఢీ.. ప్లేయింగ్ 11 ఇదే!

RR Vs PBKS Match Preview: ఈ సీజన్‌ను గెలుపుతో ఆరంభించిన పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు.. నేడు బిగ్‌ఫైట్‌కు రెడీ అయ్యాయి. గౌహతిలోని బరస్పరా క్రికెట్ స్టేడియంలో రెండు జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. రెండు జట్లు ప్లేయింగ్‌ 11లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2023, 07:32 PM IST
RR Vs PBKS: రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ ఢీ.. ప్లేయింగ్ 11 ఇదే!

RR Vs PBKS Match Preview: ఐపీఎల్‌ 2023లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్  జట్ల మధ్య ఫైట్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై విజయం సాధించి రాజస్థాన్ జోరుగా మీద ఉండగా.. అటు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలుపొందిన పంజాబ్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. రెండు జట్లలోని బ్యాట్స్‌మెన్ సూపర్‌ ఫామ్‌లో ఉండడంతో పోరు ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. రాత్రి 7.30 గంటలకు గౌహతిలోని బరస్పరా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభంకానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోని వివిధ ఛానెల్‌లలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. జియో సినిమా యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌లో ఉచితంగా చూడవచ్చు. 

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలింగ్ ధాటికి.. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్‌ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. పంజాబ్ జట్టులో సామ్ కర్రాన్, కగిసో రబడ, అర్ష్‌దీప్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. రాజస్థాన్ జట్టులో టాప్ ఆర్డర్‌లో జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, మిడిల్ ఆర్డర్‌లో సంజు శాంసన్, షిమ్రాన్ హెట్‌మేయర్ వంటి స్టార్లు ఉన్నారు. కాగా.. రాజస్థాన్‌ స్పిన్‌ ద్వయం చాహల్‌, అశ్విన్‌ల ముందు పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడతారో చూడాలి. రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్డ్ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. 

సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్‌ టాస్‌ గెలిస్తే బ్యాటింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. రెండు జట్లూ మొదటి మ్యాచ్‌లో ఆడిన జట్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్‌లో రాజస్థాన్ నవదీప్ సైనీ స్థానంలో కుల్దీప్ సేన్ లేదా సందీప్ శర్మకు అవకాశం లభించవచ్చు. బ్యాటింగ్ విషయంలో రాజస్థాన్ జట్టు దేవదత్ పడిక్కల్ స్థానంలో ఒక అదనపు బౌలర్‌ను రంగంలోకి దించవచ్చు. తర్వాత పడిక్కల్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చు. పంజాబ్ జట్టు రిషి ధావన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకునే అవకాశం ఉంది.

Also Read: DC Vs GT Highlights: ఐపీఎల్ చరిత్రలోనే డేంజర్ బాల్.. దెబ్బకు గిల్ క్లీన్‌బౌల్డ్

రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా (అంచనా)..:

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్‌మేయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, ఆర్.అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎమ్ ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్.
 
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), భానుక రాజపక్స, జితేష్ శర్మ, సికందర్ రజా, సామ్ కర్రాన్, ఎం.షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ.

Also Read: Bandi Sanjay Arrest: అర్ధరాత్రి బండి సంజయ్ అరెస్ట్.. బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News