Bandi Sanjay Arrest Update: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని బండి సంజయ్ కోరగా.. ఏ ఇష్యూ లేకపోయినా అదుపులోకి తీసుకునే అధికారం ఉందంటూ పోలీసులు ఆయనను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకున్నారు. కరీంనగర్ నుంచి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్‌ను తరలించే సమయంలో కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కార్యకర్తలను పక్కకుతోస్తూ పోలీసులు బండి సంజయ్‌ను తరలించారు. దీంతో నివాసం వద్ద పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతంగా మారాయి.
బండి సంజయ్ అత్తమ్మ మరణించి నేటికి 9వ రోజు అయింది. 9వ రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్‌కు బండి సంజయ్ రాగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పేపర్ లీకేజీ విషయంలో గురువారం ఉదయం 9 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్దమైన తరుణంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అర్ధరాత్రి ఆయన ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేశారు. తిమ్మాపూర్ మీదుగా తీసుకెళుతుండగా.. ఎల్ఎండీ సమీపంలో పోలీస్ వాహనం మొరాయించింది. వెంటనే మరో వాహనాన్ని తెప్పించి బండి సంజయ్‌ను అందులోకి ఎక్కించారు. ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పాలంటూ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పోలీసులను కోరినా.. సమాధానం చెప్పకుండా తీసుకెళ్లారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read: Forbes list 2023: ఆసియా కుబేరుడిగా ముకేష్ అంబానీ, ఫోర్బ్స్ జాబితా నుంచి అదానీ అవుట్
Fear is real in BRS.!
First they stop me from conducting press meet & now arrest me late in night.
My only mistake is to Question BRS govt on its wrong doings.
Do not stop questioning BRS even if I am jailed.
Jai Sri Ram !
Bharat Mata ki Jai !
Jai Telangana ! ✊🏻 pic.twitter.com/hzdHtwVIoR— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 4, 2023
అర్ధరాత్రి తన ఇంట్లోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా పరిగణించారు. లోక్‌సభ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ జాతీయ నాయకత్వం ఖండించింది. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ నాయకత్వం పాలన చేతగాక బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిందని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ విమర్శించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని.. రాజకీయంగా బీఆర్ఎస్ సమాధి అయ్యేరోజులు దగ్గర పడ్డాయన్నారు. మరోవైపు బండి సంజయ్ కుమార్ అరెస్టుకు నిరసనగా బీజేపీ రాష్ట్రంలో అన్ని మండల జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి