Rinku Singh: పేద క్రికెటర్ల కోసం హాస్టల్‌ నిర్మిస్తున్న కేకేఆర్ స్టార్ బ్యాటర్

Rinku Singh: కేకేఆర్ క్రికెటర్ రింకూ సింగ్ తను పడ్డ కష్టాలు ఎవరూ పడకూడదని ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న యువ క్రికెటర్ల కోసం హాస్టల్ ను నిర్మిస్తూ.. పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 08:50 AM IST
Rinku Singh: పేద క్రికెటర్ల కోసం హాస్టల్‌ నిర్మిస్తున్న కేకేఆర్ స్టార్ బ్యాటర్

Rinku Singh: ఐపీఎల్ ద్వారా ఎంతో మంది టాలెంటడ్ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో అలా దూసుకొచ్చిన  సంచలనం రింకూ సింగ్.  ఇతడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున  అద్భుతంగా ఆడుతూ అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు. అంతేకాకుండా అతడు తనకున్న కష్టాలను జయించి ఎదిగిన తీరు నలుగురికి స్పూర్తిగా నిలుస్తుంది. 

యూపీకి చెందిన  ఈ యువ క్రికెటర్ ఐపీఎల్ ద్వారా వచ్చిన సొమ్ముతో కాస్తా ఆర్థికంగా స్థిరపడ్డాడు. భారీగా ఆస్తులు లేకపోయినప్పటికీ తనలాగే కలలు సాకారం చేసుకోవాలనుకుంటటున్న వారికి తోడ్పాటు అందించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం అతడు హాస్టల్ ను నిర్మిస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న క్రికెటర్ల కోసం రింకూ అలీగఢ్‌లో హాస్టల్‌ కడుతున్నాడు. ఇందుకోసం అతడు రూ. 50 లక్షలు వెచ్చిస్తున్నాడు. 

Also Read: MI Vs KKR Highlights: వెంకటేష్ అయ్యర్ శతకం వృథా.. ముంబై చేతిలో కేకేఆర్ చిత్తు.. ఇషాన్, సూర్య మెరుపులు

''రింకూ ఎప్పటి నుంచో ఆర్థికంగా కష్టాలు పడే యువ ఆటగాళ్లు కోసం హాస్టల్ నిర్ణయించాలని అనుకున్నాడని.. ఇప్పుడు అతడు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఆ పనిని పూర్తి చేయాలనుకుంటున్నాడని'' రింకూ చిన్ననాటి కోచ్ జాఫర్ చెప్పాడు. ఇప్పటికే హాస్టల్ నిర్మాణం చాలా వరకు పూర్తయిందని.. మరో నెల రోజుల్లో మెుత్తం కంప్లీట్ అవుతుందని.. ఐపీఎల్ పూర్తయిక రింకూ దీన్ని ప్రారంభిస్తాడని జాపర్ తెలిపారు. ఐపీఎల్ లో రింకూ 2018 నుంచి కేకేఆర్ తరపునే ఆడుతున్నాడు. 

Also Read: RCB vs CSK: హోం గ్రౌండ్లో మట్టి కరిచిన బెంగళూరు జట్టు.. హోరాహోరీ పోరులో చెన్నై జయకేతనం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News