SRH Vs PBKS Live Updates: సొంతగడ్డపై హైదరాబాద్‌ బోణీ.. పంజాబ్ కింగ్స్ చిత్తు

SRH Vs PBKS IPL 2023 14th Match Live Score Updates: పంజాబ్ కింగ్స్‌తో సన్‌ రైజర్స్ హైదరాబాద్ ఢీకొడుతోంది. ఈ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2023, 11:07 PM IST
SRH Vs PBKS Live Updates: సొంతగడ్డపై హైదరాబాద్‌ బోణీ.. పంజాబ్ కింగ్స్ చిత్తు
Live Blog

SRH Vs PBKS IPL 2023 14th Match Live Score Updates: సొంతగడ్డపై హైదరాబాద్‌ ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో జయభేరీ మోగించింది. పంజాబ్ జట్టు విధించిన 144 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలోనే ఛేదించింది. రాహుల్ త్రిపాఠి (48 బంతుల్లో 74, 10 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ మార్క్‌రమ్ (21 బంతుల్లో 37, ఆరు ఫోర్లు) చివరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 రన్స్‌కే పరిమితమైంది. శిఖర్ ధావన్ (99) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో మార్కండే 4 వికెట్లతో చెలరేగగా.. జాన్సన్, ఉమ్రాన్ మాలిక్ చెరో 2 వికెట్లు, భువనేశ్వర్ ఒక వికెట్ పడగొట్టాడు.  హైదరాబాద్‌కు ఈ సీజన్‌లో తొలి విజయం కాగా.. పంజాబ్‌కు మొదటి ఓటమి. 

 

9 April, 2023

  • 23:01 PM

    రాహుల్ త్రిపాఠి బౌండరీతో విన్నింగ్ షాట్ కొట్టాడు. హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది.

  • 22:58 PM

    17 ఓవర్‌లో మార్క్‌రమ్ నాలుగు ఫోర్లు కొట్టాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ విజయం ఖాయమైపోయింది. స్కోరు 141/2 (17).

  • 22:51 PM

    హైదరాబాద్ స్కోరు: 16 ఓవర్లు ముగిసేసరికి 124/2. క్రీజ్‌లో రాహుల్ త్రిపాఠి (69), మార్క్‌రమ్ (21) ఉన్నారు. ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి 24 బంతుల్లో 20 రన్స్ కావాలి.
     

  • 22:48 PM

    హైదరాబాద్ జట్టు గేర్ మార్చింది. 15 ఓవర్‌లో ఏకంగా 21 పరుగులు పిండుకుంది. మోహిత్ వేసిన ఈ ఓవర్‌లో మార్క్‌రమ్ ఓ బౌండరీ కొట్టగా.. రాహుల్ త్రిపాఠి ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. స్కోరు: 118-2

  • 22:42 PM

    లక్ష్యం వైపు హైదరాబాద్ దూసుకెళ్తోంది. 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 97 రన్స్ చేసింది. హైదరాబాద్ విజయానికి 36 బంతుల్లో 47 పరుగులు కావాలి.

  • 22:38 PM

    రాహుల్ త్రిపాఠి ఈ సీజన్‌లో సిక్సర్‌తో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో 50 (7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రన్స్ చేశాడు. స్కోరు: 94-2
     

  • 22:32 PM

    హైదరాబాద్ స్కోరు: 12 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 86/2. ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించాలంటే 48 బంతుల్లో 58 పరుగులు చేయాలి.
     

  • 22:27 PM

    రాహుల్ చాహర్ వేసిన 11వ ఓవర్‌లో రాహుల్‌ త్రిపాఠి మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో మొత్తం 11 రన్స్ వచ్చాయి. స్కోరు: 78/2 (11)
     

  • 22:21 PM

    పది ఓవర్లు ముగిసేసరికి హైదబాద్ స్కోరు: 67/2. క్రీజ్‌లో రాహుల్ త్రిపాఠి (31), మార్క్‌రమ్ (2) ఉన్నారు. ఈ ఓవర్‌లో త్రిపాఠి మూడు బౌండరీలు బాదాడు. 
     

  • 22:18 PM

    సన్‌రైజర్స్ స్కోరు 50 పరుగులు దాటింది. 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 54 రన్స్ చేసింది. 
     

  • 22:14 PM

    హైదరాబాద్‌ రెండో వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ (21)ను రాహుల్ చాహర్ ఔట్ చేశాడు. భారీ షాట్‌కు యత్నించగా.. బౌండరీ లైన్ వద్ద సామ్ కర్రన్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు.

  • 22:11 PM

    లక్ష్యం తక్కువగా ఉండడంతో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్ కూల్‌గా బ్యాటింగ్ చేస్తున్నారు. స్కోరు: 8 ఓవర్లలో 43/1  
     

  • 22:08 PM

    ఎస్‌ఆర్‌హెచ్ స్కోరు: ఏడు ఓవర్లలో వికెట్ నష్టానికి 40 రన్స్ చేసింది. క్రీజ్‌లో మయాంక్ అగర్వాల్ (18), రాహుల్ త్రిపాఠి (9) ఉన్నారు. ఈ ఓవర్‌లో రాహుల్ త్రిపాఠి ఓ సిక్సర్ బాదాడు.
     

  • 22:05 PM

    పవర్‌ ప్లే ముగిసింది. హైదరాబాద్ స్కోరు వికెట్ నష్టానికి 34. సామ్ కర్రన్ ఈ ఓవర్‌లో నాలుగు పరుగులే ఇచ్చాడు.
     

  • 21:59 PM

    ఐదో ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టానికి  30 రన్స్ చేసింది. క్రీజ్‌లో మయాంక్ అగర్వాల్ (16), రాహుల్ త్రిపాఠి (1) ఉన్నారు. 

  • 21:55 PM

    నాలుగో ఓవర్‌లో హైదరాబాద్‌ తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ వేసిన ఈ ఓవర్‌లో తొలి రెండు బంతులను బౌండరీలు మలిచిన హ్యారీ బ్రూక్ (13) ఐదో బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. స్కోరు: 27-1 (4)

  • 21:48 PM

    మూడో ఓవర్‌లోనే పంజాబ్ స్పిన్నర్‌ను రంగంలోకి దింపింది. హర్‌ప్రీత్ ఈ ఓవర్‌లో ఐదు పరుగులు ఇచ్చాడు. స్కోరు 19/0 (3).
     

  • 21:45 PM

    హర్ష్‌దీప్ వేసిన రెండో ఓవర్‌లో మయాంక్ అగర్వాల్ రెండు ఫోర్లు బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 9 రన్స్ వచ్చాయి.
     

  • 21:42 PM

    145 రన్స్‌ టార్గెట్‌తో హైదరాబాద్ బరిలోకి దిగింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, బ్రూక్ క్రీజ్‌లో వచ్చారు. సామ్ కర్రన్ వేసిన మొదటి బంతినే బ్రూక్ బౌండరీకి తరలించాడు. అయితే ఆ తరువాత అన్ని బాల్స్ డాట్ అయ్యాయి.

  • 21:23 PM

    పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆఖరి ఓవర్‌ చివరి బంతికి సిక్సర్‌ బాది ఇన్నింగ్స్ ముగించాడు. దీంతో పంజాబ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 144 పరుగుల లక్ష్యంతో హైదరాబాద్ బరిలోకి దిగనుంది.

  • 21:17 PM

    పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ (91) సెంచరీకి చేరువలో ఉన్నాడు. భువనేశ్వర్ వేసిన 19 ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టాడు. స్కోరు: 135/9 (19) 

  • 21:13 PM

    18 ఓవర్‌లో శిఖర్ ధావన్ మెరుపులు మెరిపించాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఈ ఓవర్‌లో 2 సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. స్కోరు: 126/9 (18)

  • 21:09 PM

    17 ఓవర్‌లో భువనేశ్వర్ 8 పరుగులు ఇచ్చాడు. స్కోరు బోర్డు: 109-9
     

  • 21:00 PM

    పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ (60) ఒంటరి పోరాటం కొనసాగుతోంది. నటరాజన్ వేసిన 16 ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ ఓవర్‌లో మొత్తం 13 రన్స్ వచ్చాయి. శిఖర్ ధావన్‌కు ఐపీఎల్‌ కెరీర్‌లో 51వ అర్ధసెంచరీ. కోహ్లీ (50)ను దాటేసి రెండో స్థానానికి చేరుకున్నాడు. డేవిడ్ వార్నర్ (61) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
     

  • 20:55 PM

    ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న స్పిన్నర్ మార్కండే చెలరేగాడు. నాథన్ ఎల్లిస్ (0)ను ఔట్ చేసి తన ఖాతాలో నాలుగో వికెట్ వేసుకున్నాడు. స్కోరు: 88-9
     

  • 20:51 PM

    పంజాబ్ స్కోరు: 14 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 83 రన్స్ చేసింది. శిఖర్ ధావన్ (42) క్రీజ్‌లో పాతుకుపోయాడు.
     

  • 20:46 PM

    13 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి పంజాబ్ స్కోరు 78గా ఉంది. కెప్టెన్ శిఖర్ ధావన్ (36) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతున్నారు.
     

  • 20:38 PM

    ఓ వైపు వికెట్లు పడుతున్నా.. కెప్టెన్ శిఖర్ ధావన్ (36) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. స్కోరు బోర్డు: 77/7 (12)
     

  • 20:36 PM

    పంజాబ్ మరో వికెట్ కోల్పోయింది. హార్‌ప్రీత్ బార్ (1)ను ఉమ్రాన్ మాలిక్ క్లీన్‌బౌల్డ్ చేశాడు.
     

  • 20:32 PM

    సన్‌ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల జోరు తగ్గడం లేదు. 74 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. షారుక్ ఖాన్ (4)ను ఎల్బీడబ్ల్యూ రూపంలో మార్కండే ఔట్ చేశాడు. స్కోరు: 76/6 (11).
     

  • 20:27 PM

    పంజాబ్ స్కోరు: 10 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 73 రన్స్. క్రీజ్‌లో శిఖర్ ధావన్ (33), షారుక్ ఖాన్ (4) ఉన్నారు.
     

  • 20:16 PM

    కాస్త కోలుకుంటున్నట్లు కనిపించిన పంజాబ్ జట్టుకు మరో షాక్ తగిలింది. సామ్ కర్రన్ (22)ను మార్కండే ఔట్ చేశాడు.
     

  • 20:13 PM

    పంజాబ్ జట్టు మెల్లిగా జోరు పెంచింది. 8 ఓవర్‌లో శిఖర్ ధావన్ రెండు ఫోర్లు కొట్టాడు. స్కోరు బోర్డు: 58/3 (8).

  • 20:08 PM

    స్కోరు: ఏడు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 47 రన్స్. క్రీజ్‌లో శిఖర్ ధావన్ (22), సామ్ కర్రన్ (17) ఉన్నారు.

  • 20:05 PM

    పవర్‌ ప్లే ముగిసింది. ఆరు ఓవర్లలో పంజాబ్ మూడు వికెట్ల నష్టానికి 41 రన్స్ చేసింది. ఈ ఓవర్‌లో సామ్ కర్రన్ ఓ సిక్స్, ఫోర్ బాదాడు.

  • 19:58 PM

    ఐదు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి.. 30 పరుగులు చేసింది. క్రీజ్‌లో శిఖర్ ధావన్ (21), సామ్ కర్రన్ (1) ఉన్నారు.
     

  • 19:53 PM

    మార్కో జాన్సన్ ఎస్‌ఆర్‌హెచ్‌కు మరో బ్రేక్ ఇచ్చాడు. జితేష్ శర్మ (4)ను ఔట్ చేశాడు. దీంతో 22 రన్స్‌కే మూడు వికెట్లు కోల్పోయింది. స్కోరు బోర్డు: 22/3 (4)

  • 19:48 PM

    మూడో ఓవర్‌లో శిఖర్ ధావన్ రెండు ఫోర్లు బాదడంతో 8 పరుగులు వచ్చాయి. స్కోరు బోర్డు: 22/2 (3)

  • 19:44 PM

    రెండో ఓవర్‌లో ఐదు పరుగులు వచ్చాయి. జితేష్ శర్మ ఓ బౌండరీ బాదాడు.

  • 19:41 PM

    పంజాబ్‌ జట్టుకు మరో షాక్ తగిలింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌ మాథ్యూ షార్ట్ (1) మార్కో జాన్సెన్ ఔట్ చేశాడు. దీంతో 10 పరుగులకే పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది.  
     

  • 19:36 PM

    మొదటి ఓవర్‌లో పంజాబ్ 9 పరుగులు చేసింది. ఐదో బంతికి శిఖర్ ధావన్ బౌండరీ బాదాడు.

  • 19:33 PM

    భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ బాల్‌కే పంజాబ్‌కు షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (0)ను ఎల్బీడబ్ల్యూ రూపంలో డకౌట్ చేశాడు. 
     

  • 19:11 PM

    సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి.నటరాజన్
     

  • 19:07 PM

    పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, నాథన్ ఎల్లిస్, మోహిత్ రాథీ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
     

  • 19:06 PM

    టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ మార్క్‌రమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
     

Trending News