MI vs RCB: టాస్ గెలిచిన ముంబై.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ వచ్చేశాడు! తుది జట్లు ఇవే

MI vs RCB Live Updates: Mumbai Indians have won the toss and have opted to field. ఐపీఎల్‌ 2023లో భాగంగా వాంఖడే మైదానంలో మరికొద్దిసేపట్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : May 9, 2023, 07:29 PM IST
MI vs RCB: టాస్ గెలిచిన ముంబై.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ వచ్చేశాడు! తుది జట్లు ఇవే

MI vs RCB IPL 2023 Live Score Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2023 లో భాగంగా వాంఖడే మైదానంలో మరికొద్దిసేపట్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ముంబై ఒక మార్పు చేసింది. గాయ పడిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ స్థానంలో క్రిస్‌ జోర్డాన్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెప్పాడు. 

గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపొందగా.. ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ముంబై17,  బెంగళూరు 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాదించింది.  దాంతో నేడు ప్రతీకారం తీర్చుకునేందుకు ముంబై బరిలోకి దిగుతోంది.

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెరో 10 మ్యాచ్‌లు ఆడి ఐదేసి విజయాలు సాదించాయి.  పాయింట్ల పట్టికలో వరుసగా 6, 8 స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపొంది ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. అంతేకాదు అందరూ ఫామ్ లో ఉన్నారు. దాంతో మరో రసవత్తర పోరు జరగనుంది.

తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), అనుజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లామ్రోర్, దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్‌), వానిందు హసరంగ, హర్షల్ పటేల్, విజయ్‌కుమార్ వైశాక్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్.

ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌లు:
ముంబై ఇండియన్స్: రమణ్‌దీప్ సింగ్ , ట్రిస్టన్ స్టబ్స్, విష్ణు వినోద్, సందీప్ వారియర్, రాఘవ్ గోయల్. 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: కేదార్ జాదవ్, మైఖేల్ బ్రాస్‌వెల్, సుయాశ్‌ ప్రభుదేశాయ్‌, కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్. 

ఇక ఈ మ్యాచుకు ముందు ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఇంగ్లండ్ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఐపీఎల్‌ 16 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడు ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో.. ఈబీసీ ఆదేశాల మేరకు తన స్వదేశానికి పయనమయ్యాడు. ఆర్చర్‌ స్థానంలో మరో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ జోర్డాన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ముంబై ఇండియన్స్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

Also Read: MI vs RCB: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. స్టార్‌ బౌలర్‌ దూరం! స్వదేశంకు ప్రయాణం  

Also Read: Hyundai Cars Discount & Offers: ఈ 3 హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్‌.. చివరి తేదీకి ముందే కోనేసేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x