Prithvi Shaw And Sapna Gill Controversy: ఐపీఎల్ ప్రారంభానికి ముందు పృథ్వీ షా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ మ్యాచ్‌ల్లో అదరగొట్టి.. చాలా కాలం తరువాత టీమిండియాలో చోటు కూడా దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో కూడా అదరగొడతాడని జట్టు యాజమాన్యం భావించింది. కానీ ఈ సీజన్ ప్రారంభమైన తరువాత పృథ్వీ షా దారుణంగా ఫ్లాప్ అయ్యాడు. దీంతో చివరకు తుది జట్టులో కూడా స్థానం కోల్పోయాడు. షా స్థానంలో జట్టులోకి వచ్చిన ఫిలిప్ సాల్ట్.. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో ఆర్‌సీబీతో మ్యాచ్‌లో జట్టును గెలిపించాడు. దీంతో ఓపెనింగ్ స్లాట్‌ను ఫిక్స్ చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు షా జట్టులోకి రావడం అనుమానంగా మారింది.
ఐపీఎల్‌లో షా దారుణంగా ఫ్లాప్ అవ్వడానికి భోజ్‌పూరి నటి సప్నా గిల్‌తో వివాదం కూడా ఒక కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం తర్వాత పృథ్వీ షా నిత్యం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని ముంబై శాంతా క్రూజ్ విమానాశ్రయం సమీపంలోని ఓ లగ్జరీ హోటల్ బయట సప్నా గిల్‌తో జరిగిన వివాదంతో పృథ్వీ షా మానసికంగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ వివాదం పృథ్వీ షా ఫామ్‌పై కూడా ప్రభావం చూపించిందని అంటున్నారు.
ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన షా.. రెండుసార్లు డకౌట్ అయ్యాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో షా 12, 7, 0, 15, 0, 13 పరుగులు చేశాడు. ఈ గణంకాలు చూస్తుంటే.. షా ఎంత పేలవమైన ఫామ్‌లో ఉన్నాడో తెలిసిపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, హెడ్ కోచ్ రికీ అతనికి మళ్లీ అవకాశం ఇవ్వరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పృథ్వీ షాకు ఈ సీజన్ ముగిసిందని చెప్పొచ్చు. షా స్థానంలో జట్టులోకి వచ్చిన సాల్ట్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో సాల్ట్ 45 బంతుల్లో 87 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఢిల్లీ తన తదుపరి మ్యాచ్‌ని మే 10న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కించుకునేందుకు షా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు.
మరోవైపు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. 8 పాయింట్లతో అన్ని జట్ల కంటే చివరి స్థానంలో ఉంది. ఢిల్లీ ప్లే ఆఫ్‌కు చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో తప్పకుండా నెగ్గాల్సి ఉంటుంది. అప్పటికీ ఇతర జట్ల సమీకరణాల ఆధారంగా ప్లే ఆఫ్‌కు చేరుతుంది. చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలవడంతో ఢిల్లీ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.
Also Read: Mutual Fund Calculator: రోజుకు రూ.500 ఇన్వెస్ట్ చేయండి.. కోటీశ్వరులు అవ్వండి ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి