RCB vs CSK IPL 2023 Playing 11 Out: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరగనుంది. మరికొద్దిసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన సొంత మైదానం ఎం చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా చెన్నై బ్యాటింగ్ చేయనుంది. చెన్నై జట్టు మగాల స్థానంలో పతిరానా జట్టులోకి వచ్చాడు. మరోవైపు బెంగళూరు ఎలాంటి మార్పులు చేయలేదు.
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ అంటే అభిమానులకు ఎప్పుడూ ఇంట్రెస్టింగే. బెంగళూరు జట్టుకు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ అయినా.. ఇప్పటికీ అభిమానులకు మాత్రం విరాట్ కోహ్లీనే సారథి. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నైని ఓడించాలంటే.. బెంగళూరు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. స్టార్లతో నిండి ఉన్న ఈ మ్యాచ్ అభిమానులకు మజా ఇస్తుండడనంలో ఎలాంటి సందేహం లేదు.
ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, చెన్నై జట్లు 31 మ్యాచుల్లో తలపడ్డాయి. చెన్నై 20 విజయాలు అంసాధించగా.. బెంగళూరు 10 మ్యాచుల్లోనే విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. చిన్నస్వామి స్టేడియంలో చెన్నై, బెంగళూరు 9 మ్యాచుల్లో తలపడగా.. ఇరు జట్లు చెరో నాలుగేసి మ్యాచుల్లో గెలిచాయి.
🚨 Toss Update from M. Chinnaswamy Stadium 🏟️@faf1307 has won the toss & @RCBTweets have elected to bowl against the @msdhoni-led @ChennaiIPL.
Follow the match ▶️ https://t.co/QZwZlNju3V #TATAIPL | #RCBvCSK pic.twitter.com/rHKuDWsRuG
— IndianPremierLeague (@IPL) April 17, 2023
బెంగళూరు vs చెన్నై తుది జట్లు:
బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లామ్రోర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తిక్ (కీపర్), వానిందు హసరంగ, హర్షల్ పటేల్, పార్నెల్, మహ్మద్ సిరాజ్, వైశాక్ విజయ్‌కుమార్.
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), మతీశా పతిరాణా, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే.
బెంగళూరు vs చెన్నై డ్రీమ్ 11 టీమ్:
కీపర్ - డెవాన్ కాన్వే
బ్యాట్స్‌మెన్ - విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్
ఆల్ రౌండర్లు - రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మొయిన్ అలీ
బౌలర్లు - మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్‌పాండే, వైశాంక్ విజయ్‌కుమార్
Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలుచోట్ల వడగళ్ల వాన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.