Sunil Gavaskar apologises about Shane Warne comments: ఇలాంటి సమయంలో స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ను ఉద్దేశించి తాను అలా మాట్లాడాల్సింది కాదని భారత మాజీ ఆటగాడు, స్టార్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. వేంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, అందరూ తనని క్షమించాలని కోరారు. గత శుక్రవారం థాయ్‌లాండ్‌కు వెకేషన్‌కు వెళ్లిన ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వార్న్.. గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వార్న్ అకాల మరణంతో ప్రతిఒక్కరు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.
షేన్ వార్న్ మరణించిన నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీరు చూసిన అత్యుత్తమ స్పిన్నర్ వార్న్ ఏనా అని యాంకర్ అడగ్గా... 'నా దృష్టిలో షేన్ వార్న్ అత్యుత్తమ స్పిన్నర్ కాదు. ముత్తయ్య మురళీధరన్, భారత స్పిన్నర్లు అతడికన్నా మెరుగు. ఎందుకంటే.. భారత్ పిచ్‌లపై వార్న్ రికార్డు సాధారణంగా ఉంది. భారత్‌లో ఒక్కసారి మాత్రమే అయిదు పడగొట్టారు. స్పిన్‌లో బాగా ఆడగల భారత బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయించని అతడిని గొప్ప స్పిన్నర్ అని అనలేను' అని సన్నీ అన్నారు.
సోషల్ మీడియాలో సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. సమయం సందర్భం లేకుండా మాట్లాడావ్, చనిపోయిన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తావా? అంటూ సన్నీపై ఫాన్స్ మండిపడ్డారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎవరైనా అతని మంచి పనులు, గొప్పతనం గురించే మాట్లాడుతారని.. అది కూడా తెలియదా? అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. విమర్శల నేపథ్యంలో తన తప్పును గ్రహించినా గవాస్కర్.. అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పారు.
'ఈ సమయంలో అలాంటి ప్రశ్న అడగాల్సింది కాదు.. నేను కూడా అలా మాట్లాడాల్సి ఉండకూడదు. పోలికలు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. యాంకర్ అడిగిన ప్రశ్నకు నేను నిజాయితీగా నా అభిప్రాయం చెప్పా. క్రికెట్ చూసిన గొప్ప ఆటగాళ్లలో షేన్ వార్న్ ఒకరు. రాడ్నీ మార్ష్ ఉత్తమ వికెట్ కీపర్లలో ఒకరు. వారి ఆత్మలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు. దాంతో ఫాన్స్ కాస్త శాంతించారు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ వార్న్ అన్న విషయం తెలిసిందే.
Also Read: Medaram Hundi Income: కరోనాను లెక్కచేయని భక్తులు.. రికార్డు స్థాయిలో మేడారం హుండీ ఆదాయం?
Also Read: Revanth Reddy: అధికారుల నిర్లక్ష్యమే సింగరేణి ప్రమాదానికి కారణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook