Medaram Hundi Income: కరోనాను లెక్కచేయని భక్తులు.. రికార్డు స్థాయిలో మేడారం హుండీ ఆదాయం?

Medaram Jatara 2022 hundi income: మేడారం జాతర 2022లో మొత్తం 11,45,35,526 ఆదాయం వచ్చినట్టు దేవాలయ కార్యనిర్వహణ అధికారి రాజేంద్రం తెలిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 10:10 AM IST
  • కరోనాను లెక్కచేయని భక్తులు
  • కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్
  • రికార్డు స్థాయిలో మేడారం హుండీ ఆదాయం
Medaram Hundi Income: కరోనాను లెక్కచేయని భక్తులు.. రికార్డు స్థాయిలో మేడారం హుండీ ఆదాయం?

Medaram Jatara 2022 receives 11.45 crore hundi income: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ప్రపంచమంతా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. వైరస్ ప్రభావం అన్ని రంగాలపై భారీగానే పడింది. ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి.. 2022 జనవరిలో భారీగా పెరిగింది. దాంతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారమ్మ మహాజాతరపై పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలక్రిందులయ్యాయి. ఎప్పటిలానే ఈసారి కూడా భారీ సంఖ్యలో వనదేవతలను దర్శించుకున్నారు. దాంతో హుండీ ఆదాయం కూడా బాగానే వచ్చింది. 

హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసిన అధికారులు మేడారం జాతరకు ముగింపు పలికారు. మేడారం జాతరలో మొత్తం 11,45,35,526 ఆదాయం వచ్చినట్టు దేవాలయ కార్యనిర్వహణ అధికారి రాజేంద్రం తెలిపారు. జాతరలో ఏర్పాటు చేసిన హుండీ, తిరుగువారంలో వచ్చిన 517 హుండీలను హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో లెక్కించారు. పది రోజుల పాటు సాగిన లెక్కింపు సోమవారంతో ముగిసింది. 

631 గ్రాముల బంగారం, 48.350 వెండి ఆభరణాలు వచ్చాయని ఈవో రాజేంద్రం చెప్పారు. ఇది దాదాపుగా మూడు లక్షలు ఉంటుందన్నారు. భక్తులు విదేశీ కరెన్సీని కూడా కానుకలుగా సమర్పించారని ఆయన తెలిపారు. గత జాతరతో పోల్చితే హుండీ ఆదాయం (11.64) కొంతమేర తగ్గిందని రాజేంద్ర తెలిపారు. దీంతో ఆదివాసీ పూజారుల్లో కొంచెం నిరుత్సాహానికి గురయ్యారట. అయితే కరోనా వ్యాప్తి ఉన్నా కూడా ఇంత మొత్తంలో హుండీ ఆదాయం రావడం మాత్రం ఓ రికార్డు అని చెప్పుకొచ్చారు. 

మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి జరుగుతుందన్న విషయం తెలిసిందే. 2022లో జరిగిన జాతర 2022లో జరిగింది. ఈసారి ఫిబ్రవరి 16, 17 తేదీల్లో సమ్మక్క, సారమ్మ గద్దెలపైకి రాగా.. 18న మళ్లీ వనప్రవేశం చేశారు. ఈ మూడు రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అయితే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా మంది ముందుగానే జాతరకు వచ్చి వెళ్లారు. 

Also Read: Horoscope Today March 8 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశి వారు కష్టాలను కొని తెచ్చుకుంటారు!!

Also Read: School Teacher: విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌.. దేహశుద్ధి చేసిన పేరెంట్స్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News