Jasprit Bumrah: పూర్తిస్థాయిలో కోలుకోని జస్ప్రీత్‌ బుమ్రా.. ఐపీఎల్‌ 2023, డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు దూరం!

Jasprit Bumrah may miss IPL 2023 due to Injury. టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా లేకుండానే ఐపీఎల్‌ 2023లో ముంబై ఇండియన్స్‌ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 27, 2023, 03:04 PM IST
  • పూర్తిస్థాయిలో కోలుకోని బుమ్రా
  • ఐపీఎల్‌ 2023కి బుమ్రా దూరం
  • డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు దూరం
Jasprit Bumrah: పూర్తిస్థాయిలో కోలుకోని జస్ప్రీత్‌ బుమ్రా.. ఐపీఎల్‌ 2023, డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌కు దూరం!

Jasprit Bumrah likely to miss IPL 2023 and WTC Final 2023 due to Injury: టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గత కొన్ని నెలలుగా వెన్ను గాయంతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. భారత జట్టులోకి ఎంపికయినా.. తుది జట్టులో మాత్రం ఆడలేదు. సరైన ఫిట్‌నెస్‌ లేని కారణంగా ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. బుమ్రా చివరిసారిగా 2022 సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచులో ఆడాడు. ఆపై వెన్ను గాయం తిరగబెట్టడంతో కీలక టీ20 ప్రపంచకప్‌ 2022నకు సైతం దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు. 

గాయం నుంచి కోలుకుంటున్న జస్ప్రీత్‌ బుమ్రా.. 2023 మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 2023లో ఆడతాడని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే బుమ్రా లేకుండానే ముంబై ఇండియన్స్‌ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. బుమ్రా ఇంకా గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకోకపోవడమే అట. బుమ్రా గాయం ముందుగా అంచనా వేసిన దానికంటే తీవ్రమైనదని అని, యార్కర్ కింగ్ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని ఐపీఎల్ సహా బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఐపీఎల్ 2023కి బుమ్రా అందుబాటులో దాదాపుగా ఉండకపోవచ్చు. 

ఐపీఎల్ 2023కి మాత్రమే కాదు వచ్చే జూన్‌లో లండన్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కు జస్ప్రీత్‌ బుమ్రా దూరం కానున్నాడు. ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ సమయానికి కూడా బుమ్రా ఫిట్‌నెస్‌ సాధించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ 2023 ట్రోఫీలోని మూడో టెస్టు ఇండోర్‌ వేదికగా మార్చి1 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజయం సాధిస్తే.. చివరి టెస్టుతో సంబంధం లేకుండా భారత్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ భారత్‌ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించి.. బుమ్రా అందుబాటులో లేకపోతే టీమిండియాకు భారీ దెబ్బే అని చెప్పాలి. 

Also Read: Best Sedan 2023: ఈ సెడాన్ కారు హ్యాచ్‌బ్యాక్ కంటే మెరుగైంది.. ధర కేవలం 6 లక్షలు! ఫీచర్లు అదుర్స్

Also Read: Hyundai 7 Seater Car: ఇక సఫారీని మరచిపోవాల్సిందే.. బెస్ట్ 7 సీట్ కారు వచ్చేసింది! ధర కూడా తక్కువే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

 

Trending News